
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో తనపై భౌతిక దాడికి దిగిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్‌పై మంగళవారం విడుదల కావడాన్ని బాధితురాలు, ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివార్ తీవ్రంగా విమర్శించారు.
తనకు ఘోర పరాభవం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ ద్రౌపది వస్త్రాపహరణం పోస్టర్‌ను ఆమె 'ఎక్స్'లో పోస్ట్' చేశారు. మహాభారతంలో కౌరవులు జూదంలో గెలవడం ద్రౌపది వస్త్రాపహరణం వేళ కృష్ణుడు ద్రౌపదిని కాపాడటం వంటి సన్నివేశాలున్న పోస్టర్లు ఆమె షేర్ చేశారు.
— Swati Maliwal (@SwatiJaiHind) September 3, 2024