ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు(ఎల్జీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి నామినేట్ చేసే అధికారం వచ్చిందని తెలిపింది. ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది చట్టబద్ధమైన అధికారమని, కార్యనిర్వాహక అధికారం కాదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ సభ్యుల నామినేషన్‌కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం ఎల్జీకి లేదని పేర్కొంది.
2022 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుపొందింది. కాగా, మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి ఆప్ 134 స్థానానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఎల్జీకి కౌన్సిర్లను నియమించే అధికారం లేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అనంతరం ఈ వ్యవహారంపై ఆప్ సుప్రీం కోర్టును అశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment