న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ పదవీ కాలాన్ని సీఎం కేజ్రీవాల్ మరో మూడేళ్లు పొడిగించారు. ఆమె బృందం పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పదవిలో 2015లో స్వాతి మలివాల్ మొదటిసారిగా నియమితురాలయ్యారు. సీఎం కేజ్రీవాల్ సహకారంతో డీసీడబ్ల్యూ ఢిల్లీలోని లక్షలాది మంది బాలికలు, మహిళల జీవితాలను మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా స్వాతి మలివాల్ పేర్కొన్నారు. 181 హెల్ప్‌లైన్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బాలికలను అక్రమ రవాణాదారుల నుంచి, వేశ్యావాటికల నుంచి కాపాడినట్లు చెప్పారు.
డీసీడబ్ల్యూ పనితీరు అద్భుతం: సీఎం కేజ్రీవాల్
Published Wed, Jul 7 2021 10:46 AM | Last Updated on Wed, Jul 7 2021 10:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment