Delhi Commission for Women
-
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
మహిళల కోసం ఢిల్లీ కమిషన్ మెట్లెక్కిన హీరోయిన్లు
Yami Gautam Neha Dhupia Visit Delhi Commission For Women: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. బీటౌన్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్స్డే' మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులతోపాటు విమిర్శకులను సైతం మెప్పించింది యామీ గౌతమ్. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా అత్యాచార వేధింపులకు గురైన మహిళల భద్రత కోసం, వారికి పునరావాసం కల్పించేందుకు మజ్లీస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. చదవండి: సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్‌లో ఇలా ఈ క్రమంలోనే యామీ గౌతమ్ ఢిల్లీ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలోని తనతోపాటు నటించిన హీరోయిన్ నేహా ధూపియా కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌ను సందర్శించారు. కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్తోపాటు ఇతర అధికారులతో చర్చించారు. ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా కోసం వారు చేపట్టిన వివిధ కార్యాక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మహిళలపై హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఉన్న 181 హెల్ప్‌లైన్ నంబర్, దాని పనితీరు గురించి వివరంగా తెలుసుకున్నారు. చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు పెట్రోల్ వ్యాన్లు పంపిస్తారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాలో చూపించినట్లు మహిళల భద్రత కోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని యామీ తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, ఇతర అధికారులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం ఈ బృందం చూపిన చొరవపట్ల అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు యామీ గౌతమ్. కాగా యామీ గౌతమ్, నేహా ధూపియా నటించిన 'ఏ థర్స్డే' చిత్రం ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్టీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
వారి పనితీరు అద్భుతం.. అందుకే పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ పదవీ కాలాన్ని సీఎం కేజ్రీవాల్ మరో మూడేళ్లు పొడిగించారు. ఆమె బృందం పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పదవిలో 2015లో స్వాతి మలివాల్ మొదటిసారిగా నియమితురాలయ్యారు. సీఎం కేజ్రీవాల్ సహకారంతో డీసీడబ్ల్యూ ఢిల్లీలోని లక్షలాది మంది బాలికలు, మహిళల జీవితాలను మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా స్వాతి మలివాల్ పేర్కొన్నారు. 181 హెల్ప్‌లైన్ ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బాలికలను అక్రమ రవాణాదారుల నుంచి, వేశ్యావాటికల నుంచి కాపాడినట్లు చెప్పారు. -
వృద్ధురాలిపై అత్యాచారం..నిందితుడి అరెస్ట్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధురాలిగా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం ఢిల్లీ చావ్లాలోనా నజాఫ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి అదే అదే ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధురాలిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ( డీసీడబ్ల్యూ ) చీఫ్ స్వాతి మాలివాల్ బాధిత వృద్దురాలిని పరామర్శించారు. కాగా ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం. పోలీసుల చర్యను ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. (ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) अम्मा उस 33 साल के दरिंदे से भीख माँगती रही की उनको छोड़ दे! वो उसके दादी की उमर की हैं। पर हवस के नशे में डूबे हुए उस जानवर ने रेप कर सब हद पार कर दीं! कैसा समाज है हमारा? इंसानियत मर गयी है जिसके लिए 6 महीने की बेटी और 90 साल की महिला - दोनों ही सिर्फ़ एक वस्तु है। शर्मनाक! https://t.co/wleCn8wBPl — Swati Maliwal (@SwatiJaiHind) September 8, 2020 -
విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్...భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్(39) నుంచి ఆమె చట్టబద్దంగా విడిపోయారు. స్వాతి మలివాల్ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె.. దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ఘజియాబాద్ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్ఎస్ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు నవీన్ జైహింద్ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. కొంతకాలం కలిసుండి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. చిచ్చుపెట్టిన మీటూ.. చిన్న వయసులోనే డీసీఎం చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన స్వాతి మలివాల్.. మహిళల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా పాటుపడ్డారు. చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా దూరమైన జంట.. బుధవారం నాటికి విడాకులు తీసుకుంది. -
కూతురుకి మద్యం తాగించిన తండ్రి!
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సొంత బిడ్డకు పాల సీసాలో మద్యం పట్టించిన ఓ కసాయి తండ్రి ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో చోటుచేసుకోగా.. స్థానికులు చొరవతో ఢిల్లీ మహిళా కమిషన్ ఆ పసిపాపను రక్షించింది. గత మూడురోజులుగా ఆ పాపకు తన తండ్రి ఆహారం పెట్టడంలేదని అందిన ఫిర్యాదుకు స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్‌కు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఆ పసిపాపను రక్షించడం కోసం కమిషన్ సభ్యులు అక్కడికి వెళ్లగా.. తీవ్ర విరేచనాలు చేసుకోని గదిలో అచేతన స్థితిలో ఉన్నఆ పసిపాప కనిపించింది. ఆ పాప పక్కనే ఫుల్‌గా తాగి ఏమాత్రం సోయి లేకుండా ఆ చిన్నారి తండ్రి పడి ఉన్నాడు. అతని లేపడానికి ప్రయత్నించిన కమిషన్ సభ్యులను నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. వారి పక్కనే ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. వెంటనే ఆ పాపను సమీప ఆసుపత్రికి తరలించిన మహిళా కమిషన్ సభ్యులూ.. పోలీసులకు సమాచారం అందించి ఆ కసాయి తండ్రిని అరెస్ట్ చేయించారు. ఏడాది క్రితం ఆ పాప తల్లి మరణించిందని, ఆమె తండ్రి రిక్షా తోలి ఫుల్‌గా మద్యం తాగుతాడని చుట్టుపక్కల వాళ్లు ఈ సందర్బంగా మహిళా కమిషన్ సభ్యులకు తెలిపారు. అంతేకాకుండా అతను పనికి వెళ్లేటప్పుడు తన కూతురుని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్తాడని, పక్కని వారినెవ్వరని సాయం చేయనియ్యడని పేర్కొన్నారు. ఆ పాప ఆకలితో రోజు ఏడుస్తూనే ఉండేదని, ఏడ్వకుండా పాపకు పాలసీసాలో లిక్కర్ పోసి తాగించేవాడని చెప్పారు. దీనికి చలించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఆ కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించింది. ఆ పాప ఆరోగ్యం కుదుట పడిన తర్వాత షెల్టర్ హోమ్‌కు తరలిస్తామని పేర్కొంది. -
వేశ్యాగృహాలను మూసివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్న 125 వేశ్యాగృహాలను మూసివేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ వాటి నిర్వాహకులకు సమన్లు ఇచ్చింది. వివిధ రకాల ఏజెన్సీలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా పొంతనలేని సమాధానాలివ్వడంతో అసలైన నిర్వాహకు లను గుర్తించడం కమిషన్‌కు చాలా కష్టతరమైంది. దీంతో వీరిని సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య తమ వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు తెలిపారు. కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకోవడానికి నిరాక రించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించామని వారు పేర్కొన్నారు. ఇంతకుముందే కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లోని సీనియర్ అధికారులు, ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ జల్ బోర్డు, అగ్ని మాపక విభాగం, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్లోని వారితో ఓ కమిటీ దీని కోసమే ఏర్పాటయింది. ఢిల్లీ మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ ప్రిన్సీ గోయెల్, మొబైల్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కిరణ్ నేగిల ఆధ్వర్యంలోని బృందం ఈ సమన్లు అందజేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను జీబీ రోడ్డులోని వేశ్యాగృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నా రు. ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా ఇక్కడి వేశ్యాగృహాల నిజమైన యజమానులు బయట పడలేదని, కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పార్లమెంటుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. -
బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు
న్యూఢిల్లీ: రేప్ చేస్తామని వచ్చిన బెదిరింపులపై కార్గిల్ అమరవీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ సోమవారం ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు వ్యతిరేకంగా మాట్లాడడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో కౌర్ పేర్కొంది. బెదిరింపులకు దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి బెదిరింపులకు దిగకుండా చూడాలని డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కోరారు. తమకు గుర్ మెహర్ కౌర్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమైతే చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, తనపై ఏఐఎస్ఏకు చెందిన ఇద్దరు తనను వేధించారని ఏబీవీపీకి చెందిన డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 21న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్ సీసీ) వెలుపల తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇదంతా ఏబీవీపీ ఆడుతున్న నాటకమని ఏఐఎస్ఏ ప్రతినిధి అమన్ ఆవాజ్ ఆరోపించారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
సోమ్నాథ్పై గృహహింస ఫిర్యాదు
ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన భార్య న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీకి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో న్యాయ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ అరెస్టు, రాజీనామా ఉదంతం జరిగి 24గంటలైనా కాకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక గృహహింస చట్టం కింద ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)లో బుధవారం ఫిర్యాదు చేశారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు జూన్ 26లోగా తమ ముందు హాజరై సమాధానం చెప్పాలని డీసీడబ్ల్యూ సోమ్‌నాథ్‌కు నోటీసు ఇచ్చింది. భర్త, ఆయన అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని లిపిక చెప్పారు. 2010 నుంచీ సోమ్‌నాథ్ ఆమెను వేధిస్తున్నారని.. ఇక ఈ వేధింపులకు ముగింపు పలకాలని లిపిక భావిస్తున్నారని డీసీడబ్ల్యూ చైర్పర్సన్ బర్ఖాసింగ్ అన్నారు. మూడేళ్లుగా లిపిక సోమ్‌నాథ్‌కు దూరంగా విడిగా ఉంటున్నప్పటికీ, ఆయన ఆమె దగ్గరకు వచ్చిపోతున్నారని బర్ఖా చెప్పారు. 2010 నుంచి సోమ్‌నాథ్‌తో గడ్డుకాలాన్ని అనుభవించానని, వివాహ బంధం నుంచి విముక్తి కోరుకుంటున్నానని లిపిక చెప్పారు. -
మంత్రిగారా... మజాకా!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలో విదేశీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీ శుక్రవారం కూడా ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుట హాజరుకాలేదు. తన న్యాయవాదిని ఢిల్లీ మహిళా కమిషన్‌కు పంపారు. కమిషన్ ముందు హాజరు కావాల్సిన సమయంలో ఆయన మాత్రం జల్సాగా గాలిపటాలు ఎగరేసుకుంటూ కనిపించడం, ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగినా నవ్వుతూ వెళ్లిపోవ డం వంటి చర్యలతో మరోమారు వార్తల్లోకెక్కారు. సంజాయిషీ వినడానికి ససేమిరా... మంత్రి స్వయంగా రాకుండా న్యాయవాదిని పంపడంతో ఆగ్రహించిన మహిళా కమిషన్ మంత్రి తరపున వచ్చిన న్యాయవాది సంజాయిషీ వినడానికి నిరాకరించింది. దీనితో మహిళా కమిషన్ సభ్యులకు, న్యాయవాదికి మధ్య తీవ్రవాగ్వివాదం జరి గింది. ఉగాండా మహిళల ఫిర్యాదుపై ఢిల్లీ మహిళల కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ మహిళా కమిషన్ ఆదేశాల ప్రకారం సోమ్‌నాథ్ భారతీ స్వయంగా రాకుండా తన తరుఫున న్యాయవాదిని పంపారు. సోమ్‌నాథ్ భారతీ తరపున ఆయన న్యాయవాది ఇచ్చే సంజాయిషీ వినడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ నిరాకరించారు. సోమ్‌నాథ్ భారతీ సంతకం చేసిన ఆథరైజేషన్ లెటర్ చూసిన తరువాతే అతని సంజాయిషీ వింటానని చెప్పారు. సోమ్‌నాథ్ భారతీకి తప్పు చిరునామాకు సమన్లు పంపారని, సకాలంలో సమసన్లు అందనందువల్ల ఆయన స్వయంగారాలేకపోయారని అందువల్ల ఆయన శుక్రవారం రాలేకపోయారని, సోమవారం హాజరువుతారని సోమ్‌నాథ్ తరపున వచ్చి న న్యాయవాది రిషికేష్ కుమార్ చెప్పారు. దీనిపై కాసేపు వాగ్వావాదం జరిగింది. బర్ఖాసింగ్ గుస్సా.. రెండోసారి సమన్లు జారీ చేసిన తరువాత కూడా సోమ్‌నాథ్ భారతీ రాకపోవడం ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఆగ్రహం తెప్పించింది. సోమ్‌నాథ్ భారతి ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారని బర్ఖాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థను అవమానించడమేనని బర్ఖాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సోమ్‌నాథ్ భారతి కొంతమందితో వచ్చి అర్ధరాత్రి సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తించారని ఉగాండా మహిళలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై మహి ళా కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి మంగళవారం తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ ఆసమయంలో ధర్నాలో ఉన్న సోమ్‌నాథ్ భారతీ మహిళా కమిషన్ ఎదుట హాజ రుకాలేదు. తనకు సమన్లు అందలేదని ఆయన చెప్పారు. దీంతో మహిళా కమిషన్ మరోమారు ఆయనకు సమన్లు జారీ చేసి శుక్రవారం తన ముందుండాలని పేర్కొంది. ఈ సారి కూడా హాజరుకానట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని మహిళా కమిషన్ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ మంత్రి హాజరు కాలేదు. కాగా దీనిపై బర్ఖాసింగ్ తదుపురి ఎలా స్పందిస్తారో చూడాలి..!