న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తన పదవికి రాజీనామా చేశారు. స్వాతి మాలివాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో డీసీడబ్ల్యూ పదవికి ఆమె రాజీనామా చేశారు. అనంతరం తన చాంబర్‌లో తోటి ఉద్యోగులకు వీడ్కోలు పలికారు. రాజీనామా లేఖపై సంతకం చేసి వెళుతున్న క్రమంలో మలివాల్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తోటి ఉద్యోగులను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. పలువురు మహిళలు కూడా ఉద్యేగానికి లోనయ్యారు. కొందరు స్వాతి వెళుతున్న క్రమంలో చప్పట్లు కొడుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi Commission for Women (DCW) Chief Swati Maliwal resigns from her post after being nominated for Rajya Sabha by Aam Aadmi Party (AAP). pic.twitter.com/yp19yGcqeT కాగా ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాల పదవీకాలం జనవరి 27న పూర్తవనుంది. ఈ మూడు స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తాను వరుసగా రెండోసారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది. ఇక, సుశీల్ కుమార్ గుప్తా.. ఈ ఏడాది చివర్లో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో స్వాతి మాలివాల్‌ను పార్టీ నామినేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ భావోద్వేగం..కన్నీరు పెట్టుకున్న స్వాతి మలివాల్
Published Fri, Jan 5 2024 5:53 PM | Last Updated on Fri, Jan 5 2024 8:06 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment