న్యూఢిల్లీ: ఎంపీ స్వాతి మలివాల్‌కు మే13వ తేదీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ లేదని సీఎం సహాయకుడు బిభవ్‌కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఆ రోజున ఆమె సీఎం ఇంటి వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. మలివాల్‌పై 13న సీఎం ఇంట్లో దాడి జరిగిన కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం(మే17) అరెస్టు చేశారు.
బిభవ్ అరెస్టయిన వెంటనే ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఎంపీ స్వాతిమలివాల్ సీఎం ఇంటికి వచ్చినరోజుకు సంబంధించి సోషల్‌మీడియాలో సర్క్యులేషన్‌లో ఉన్న వీడియోలను కోర్టుకు సమర్పించారు. అసలు స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment