ఆప్‌ జోరు : బీజేపీ బేజారు | Delhi MCD election AAP wins 4 seats, Congress bags one | Sakshi
Sakshi News home page

15 ఏళ్లుగా విసిగిపోయారు : ఎంసీడీలో ఇక ఆప్‌కే పట్టం

Published Wed, Mar 3 2021 2:21 PM | Last Updated on Thu, Mar 4 2021 11:42 AM

Delhi MCD election AAP wins 4 seats, Congress bags one - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. ఈఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో విజయ సాధించింది. ఆదివారం జరిగిన ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆప్‌ నాలుగు, కాంగ్రెస్‌ ఒకస్థానంలో విజయం సాధించింది.  త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక స్థానంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోగా, బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. తాజా ఫలితం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఐదు వార్డుల ఓట్ల లెక్కంపు ఆరంభంనుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన  ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సునాయాసంగా విజయాన్ని తమఖాతాలో వేసుకున్నారు. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్‌పురి, త్రిలోక్‌పురి, రోహిణి-సీ వార్డులలో గెలుపొందారు. దీంతో  ఆప్ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. చౌహాన్ బాంగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ ప్రజలు మరోసారి సుపరిపాలన కోసం ఓటు వేశారంటూ ట్వీట్‌ చేశారు. 15 ఏళ్ల నుంచి ఢిల్లీ కార్పోరేషన్‌లలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రజలు విసిగిపోయారని ఎంసిడిలలో ఆప్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారనివ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఓటు వేసి గెలిపించిన ఢిల్లీ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 


  
ఓటు శాతం ఇలా ఉంది
ఆమ్ ఆద్మీ పార్టీ: 46.10శాతం
భారతీయ జనతా పార్టీ: 27.29శాతం
కాంగ్రెస్: 21.84శాతం 
బహుజన్ సమాజ్ పార్టీ: 2.50శాతం
స్వతంత్రులు: 1.64శాతం 
నోటా: 0.63 శాతం

గెలుపొందిన అభ్యర్థులు
షాలీమార్ బాగ్ నార్త్ -సునీతా మిశ్రా
కల్యాణ్‌పురి - ధిరేందర్ కుమార్
త్రిలోక్‌పురి ఈస్ట్ -విజయ్ కుమార్
రోహిణి-సీ - రామ్ చందర్‌
చౌహాన్ బాంగర్‌ - జుబేర్ అహ్మద్ చౌదరి కాంగ్రెస్ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement