ఆప్ ప్రభుత్వానికి మద్దతివ్వం: కాంగ్రెస్
Published Tue, May 20 2014 7:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మద్దతుపై వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఆప్ కు తాము మద్దతివ్వబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి సిద్దమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 70 సభ్యుల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 27, కాంగ్రెస్ పార్టీకి 8 సభ్యులున్నారు.
ఆప్ కు ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ చీఫ్ అవిందర్ సింగ్ లవ్వీ వెల్లడించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై భారతీయ జనతాపార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
Advertisement