దురహంకారానికి తగిన మూల్యం: వెంకయ్య | Arvind Kejriwal’s AAP handed capital punishment, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

దురహంకారానికి తగిన మూల్యం: వెంకయ్య

Published Wed, Apr 26 2017 2:27 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

దురహంకారానికి తగిన మూల్యం: వెంకయ్య

దురహంకారానికి తగిన మూల్యం: వెంకయ్య

న్యూఢిల్లీ: దురహంకారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తగిన మూల్యం చెల్లించుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని ఆయన బుధవారమిక్కడ సూచించారు. కేజ్రీవాల్‌ పాలనతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని వెంకయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరిత వైఖరిని విడనాడి ఇప్పటికైనా కేజ్రీవాల్‌ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈవీఎంలపై నిందలు సరికాదని వెంకయ్య అన్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement