ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్‌ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.
కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్‌కు చెందినవాళ్లే కావటం గమనార్హం.
2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment