Afjal Guru
-
అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్‌గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.డిసెంబర్13, 2001న పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలుచేశారు. -
‘కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురు మద్దతుదారు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్‌ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్‌కు చెందినవాళ్లే కావటం గమనార్హం.2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే. -
పార్లమెంటు పేలుళ్ల దోషి అమాయకుడు!
-
పార్లమెంటు పేలుళ్ల దోషి అమాయకుడు!
న్యూఢిల్లీ: సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చల్లారటం లేదు. పలుచోట్ల ఈ దాడులు హింసాత్మకంగా మారగా కొందరు విద్యార్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలో 2001లో పార్లమెంట్‌పై దాడికి దిగబడ్డ ముష్కరుడు అఫ్జల్ గురును ఓ జేఎన్‌యూ విద్యార్థిని అమాయకుడిగా అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారం ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ యువతి ప్రసంగిస్తూ.. ‘మనమందరం సీఏఏ, ఎన్నార్సీ గురించి పోరాడుతున్నాం. కానీ మనం దేనిపై నమ్మకం పెట్టుకోలేమని అర్థమవుతోంది. ఇటు ప్రభుత్వాన్ని, అటు సుప్రీంకోర్టును కూడా విశ్వసించలేం. ఎందుకంటే ఈ న్యాయస్థానం భారతీయులను సంతృప్తి పరిచేందుకు అఫ్జల్‌గురును ఉరితీయమని ఆదేశించింది. కానీ చాలా సంవత్సరాల అనంతరం తెల్సిన విషయమేంటంటే.. పార్లమెంటు దాడుల్లో అఫ్జల్‌గురుకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇక ఇదే సుప్రీం కోర్టు.. బాబ్రీ మసీదు కింద గుడి ఉందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. దీంతో గుడి తాళాలు పగలగొట్టడం, దాన్ని కూల్చివేయడం అంతా అబద్ధమే అని నిరూపితమైంది. కానీ న్యాయస్థానం అనూహ్యంగా తిరిగి అదేచోట ఆలయం నిర్మించుకోడానికి అనుమతినిచ్చింది. దీన్నిబట్టి సుప్రీం కోర్టును నమ్ముకోవడం కూడా దండగే’ అని ఆమె పేర్కొంది. కాగా అల్లర్లకు కారణమయ్యే వ్యాఖ్యలు చేసినందుకుగానూ పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమెను జేఎన్యూకు చెందిన విద్యార్థిని అఫ్రీమ్ ఫాతిమాగా తేల్చారు. ఇక దీనిపై సంబిత్ పాత్రా స్పందిస్తూ ఆమె సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తూ విషాన్ని, ద్వేషాన్ని చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక భారత్ నుంచి అసోంను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజలను రెచ్చగొడతున్న ఇమామ్‌కు సైతం ఆమె మద్దతు పలికిందని ఆయన మండిపడ్డారు. అయితే ఆమె ఎక్కడ మాట్లాడిందన్నది తెలియరాలేదు. చదవండి: అఫ్జల్ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది? ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఆజాద్ -
అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించండి: పీడీపీ
జమ్మూ: పార్లమెంట్‌పై దాడి కేసు దోషి అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించాలని కేంద్రాన్ని పీడీపీ డిమాండ్ చేసింది. ఉగ్రవాది అఫ్జల్‌ను తీహార్ జైల్లో 2013, ఫిబ్రవరి 9న ఉరితీసి, అనంతరం ఖననం చేయడం తెలిసిందే. ‘అఫ్జల్ గురు మృతదేహ అవశేషాలను వెనక్కు తెప్పిస్తామన్నది పీడీపీ హామీ. ఆ దిశగా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆయన అవశేషాలను అప్పగించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అఫ్జల్ గురు ఉరి న్యాయాన్ని అవహేళన చేయడమేనని పీడీపీ భావిస్తోంది. ఆ ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. నిందితుల్లో 28వ వాడుగా ఉన్న అఫ్జల్‌గురును ప్రత్యేకంగా విచారించి, ఉరిశిక్ష విధించడాన్ని పీడీపీ అప్పుడే ఖండించింది. గురుకు క్షమాభిక్ష ప్రకటించి ఉండాల్సింది. అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రకటించాలన్న తీర్మానాన్ని 2011 కశ్మీర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వలేదు’ అని ఆ ప్రకటనలో వివరించారు.