న్యూఢిల్లీ: సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చల్లారటం లేదు. పలుచోట్ల ఈ దాడులు హింసాత్మకంగా మారగా కొందరు విద్యార్థులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలో 2001లో పార్లమెంట్‌పై దాడికి దిగబడ్డ ముష్కరుడు అఫ్జల్ గురును ఓ జేఎన్‌యూ విద్యార్థిని అమాయకుడిగా అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారం ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో ఆ యువతి ప్రసంగిస్తూ.. ‘మనమందరం సీఏఏ, ఎన్నార్సీ గురించి పోరాడుతున్నాం. కానీ మనం దేనిపై నమ్మకం పెట్టుకోలేమని అర్థమవుతోంది. ఇటు ప్రభుత్వాన్ని, అటు సుప్రీంకోర్టును కూడా విశ్వసించలేం. ఎందుకంటే ఈ న్యాయస్థానం భారతీయులను సంతృప్తి పరిచేందుకు అఫ్జల్‌గురును ఉరితీయమని ఆదేశించింది. కానీ చాలా సంవత్సరాల అనంతరం తెల్సిన విషయమేంటంటే.. పార్లమెంటు దాడుల్లో అఫ్జల్‌గురుకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇక ఇదే సుప్రీం కోర్టు.. బాబ్రీ మసీదు కింద గుడి ఉందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. దీంతో గుడి తాళాలు పగలగొట్టడం, దాన్ని కూల్చివేయడం అంతా అబద్ధమే అని నిరూపితమైంది. కానీ న్యాయస్థానం అనూహ్యంగా తిరిగి అదేచోట ఆలయం నిర్మించుకోడానికి అనుమతినిచ్చింది. దీన్నిబట్టి సుప్రీం కోర్టును నమ్ముకోవడం కూడా దండగే’ అని ఆమె పేర్కొంది.
కాగా అల్లర్లకు కారణమయ్యే వ్యాఖ్యలు చేసినందుకుగానూ పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమెను జేఎన్‌యూకు చెందిన విద్యార్థిని అఫ్రీమ్ ఫాతిమాగా తేల్చారు. ఇక దీనిపై సంబిత్ పాత్రా స్పందిస్తూ ఆమె సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తూ విషాన్ని, ద్వేషాన్ని చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక భారత్ నుంచి అసోంను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజలను రెచ్చగొడతున్న ఇమామ్‌కు సైతం ఆమె మద్దతు పలికిందని ఆయన మండిపడ్డారు. అయితే ఆమె ఎక్కడ మాట్లాడిందన్నది తెలియరాలేదు. చదవండి: అఫ్జల్ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment