Kanhayya kumar
-
‘కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురు మద్దతుదారు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ మంగళవారం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ హాట్ కామెంట్లు చేశారు. కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు అని మండిపడ్డారు. మనోజ్ తివారీ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.‘తన ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌తో పోటీ ఆసక్తికంగా మారనుంది. కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించటం.. ప్రతిపక్షాల కుట్రను వెల్లడిస్తుంది. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్య కుమార్‌ను పోటీ చేయించి కాంగ్రెస్, ఆప్ పార్టీలు వాటి అసలు రంగు బయటపెట్టాయి. ప్రతిపక్షాల అభ్యర్థిపై గతంలో ఉన్న వివాదాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు భద్రత కోరుకుంటాన్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎల్లప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటారు.కన్హయ్య కుమార్ ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుదారు. గతంలో అఫ్జల్‌గురుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఓటర్లు మర్చిపోతారా?’ అని ఎంపీ మనోజ్ తివారీ అన్నారు ఇక.. ఈశాన్య ఢిల్లీలో మైనార్జీ జనాభా అధికంగా ఉంటుంది. మరోవైపు.. మనోజ్ కుమార్, కన్హయ్య కుమార్ ఇద్దరూ బిహార్‌కు చెందినవాళ్లే కావటం గమనార్హం.2001 డిసెంబరు 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి దాడి జరిగింది. ఐదుగురు ఉగ్రవాదుల పార్లమెంట్‌లోకి చొరబడి తొమ్మిది మంది భద్రతాసిబ్బందిని బలితీసుకున్నారు. ఆ మరుసటి రోజే దాడికి సూత్రధారి అయిన ఉగ్రవాది అఫ్జల్ గురును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 12ఏళ్లకు అతడు దోషిగా తేలడంతో ఉరితీసిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపారు. ‘ప్రధాని మోదీపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన అరవింద్ కుమార్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతన్ని మస్తురీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నాం’ అని బిలాస్పూర్ ఏఎస్పీ(రూరల్ అర్చనా ఝా తెలిపారు. శనివారం భాదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అరవింద్ కుమార్ తీవ్రమైన అసభ్య పదజాలంతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో బీజేపీ నేత బీపీ సింగ్ అరవింద్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రధానిమోదీపై అరవింద్ అనే వ్యక్తి అస్యభ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిలాస్పూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి దేవేంద్రసింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో ఏప్రిల్ 19 నుంచి మే 7వరకు మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేవేంద్ర సింగ్ యాదవ్ బిలాయ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. బీజేపీ అభ్యర్థి టోకెన్ సాహూకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సింగ్‌ను బరిలోకి దించింది. -
కాంగ్రెస్ టాలెంట్ హంట్.. యువ నేతలపై వల
న్యూఢిల్లీ: వలసలు, వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ కొత్త జవసత్వాలు కూడగట్టుకునే పనిలో పడింది. యువ తరమే పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్న అధిష్టానం ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్, ప్రియాంక చతుర్వేది వంటి యువనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల్లో తమకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వంటి నాయకుల్ని కాంగ్రెస్ అక్కున చేర్చుకోవాలని చూస్తోంది. మోదీకి ఎదురొడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదిరించి ప్రజల్లోకి బాగా దూసుకువెళ్లిన నాయకుల్లో కన్హయ్య కుమార్ ఒకరు. విద్యార్థి సంఘం నాయకుడిగా కేంద్రంపై ఆయన సంధించే ఒక్కో మాట తూటాలా పేలేది. ఆయన ప్రసంగాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీపీఐలో చేరిన కన్హయ్య కుమార్ బెగుసరాయ్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పట్నుంచి పెద్దగా వార్తల్లోకి రాని ఆయన వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. లెఫ్ట్ పారీ్టలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అనుకుంటున్న కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాందీని మంగళవారం కన్హయ్య కుమార్ కలుసుకొని చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ కన్హయ్య కుమార్ ఎక్కడికి వెళ్లినా జనాన్ని ఆకర్షించే శక్తి ఉన్న నాయకుడు. ఆయన సభలకు యువత భారీగా తరలి వస్తుంది. అందుకే వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కన్హయ్య కుమార్‌ని ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. బిహార్ ఎన్నికల నాటికి ఆయనను కాంగ్రెస్ పారీ్టలో కొత్త శక్తిగా తీర్చిదిద్దాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుజరాత్లో నాయకత్వ సమస్య గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని సైతం కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో జిగ్నేష్ మేవాని పోటీ చేసిన వడ్గమ్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని దింపకుండా ఆయన విజయానికి కాంగ్రెస్ పరోక్షంగా సహకరించింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పారీ్టలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆటంక రాజకీయాలు వద్దు
ప్రభుత్వానికి సహకరించాలి: రాజ్యసభలో జైట్లీ ఏ విద్యార్థి మీదా సర్కారుకు వ్యతిరేకత లేదు న్యూఢిల్లీ: కీలకమైన బిల్లులు రాజ్యసభలో నిలిచిపోయి ఉన్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఆటంక రాజకీయాలను విడనాడి ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో.. జేఎన్‌యూ, అసహనం, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం అంశాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో జైట్లీ మాట్లాడారు. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి కన్హయ్యకుమార్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వానికి ప్రత్యేకించి ఏ విద్యార్థి మీదా వ్యతిరేకత లేదని, అయితే వాక్స్వాతంత్య్రం కింద దేశ విభజన ప్రచారానికి అనుమతించబోమన్నారు. ‘వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వంటి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ముందు వరుసలో ఉంటాయని ఆశిస్తున్నా. ఇటువంటి వారికి గౌరవయోగ్యతను ఇచ్చే పనులు చేయకండి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు సంబంధించి యూపీఏ ప్రభుత్వం సాధించిన ప్రయోజనాలను ఎన్డీఏ సర్కారు కాలరాస్తోందన్న రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. ‘దేశంలో జరిగిన దాడి వారి దేశం నుంచే జరిగిందని తొలిసారి ఒప్పుకునేలా మేం ఒత్తిడితెస్తున్నాం’ అని పేర్కొన్నారు. చమురు ధరల తగ్గుదల ప్రయోజనాల్లో సింహభాగం ప్రజలకే బదిలీ చేస్తున్నామని, నష్టాల్లో ఉన్న చమురు సంస్థలకు కొంత భాగం అందిస్తూ.. ఇంకొంత భాగాన్ని పల్లెల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి పెట్టుబడి పెడుతున్నామన్నారు. ఇష్రాత్జహాన్ కేసు విషయాన్ని లేవనెత్తుతూ.. నాటి గుజరాత్ సీఎం మోదీని ఇరికించేందుకు కాంగ్రెస్ నిందితులతో కుమ్మక్కయిందని ఆరోపించారు. నల్లధన వెల్లడికి తెచ్చిన పథకంపై రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. 1997లో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పథకాన్ని ప్రస్తావించారు. అందులో.. నల్లధనం వెల్లడిస్తే ఎటువంటి జరిమానా లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. కన్హయ్యకు భద్రత కల్పించాలి: ఆజాద్ జేఎన్‌యూఎస్‌యూ చీఫ్ కన్హయ్య ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో.. ఆయనకు భద్రత కల్పించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. తగినంత భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కాగా, దేశ శత్రువుల (పాక్ జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను సంరక్షుడి (కేంద్ర ప్రభుత్వం) ఆధ్వర్యంలో కొనసాగించేందుకు శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.