
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపారు. ‘ప్రధాని మోదీపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన అరవింద్ కుమార్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతన్ని మస్తురీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నాం’ అని బిలాస్‌పూర్ ఏఎస్పీ(రూరల్ అర్చనా ఝా తెలిపారు. శనివారం భాదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అరవింద్ కుమార్ తీవ్రమైన అసభ్య పదజాలంతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు.
దీంతో బీజేపీ నేత బీపీ సింగ్ అరవింద్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రధానిమోదీపై అరవింద్ అనే వ్యక్తి అస్యభ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిలాస్‌పూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి దేవేంద్రసింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో ఏప్రిల్ 19 నుంచి మే 7వరకు మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేవేంద్ర సింగ్ యాదవ్ బిలాయ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. బీజేపీ అభ్యర్థి టోకెన్ సాహూకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సింగ్‌ను బరిలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment