
రాయ్‌పుర్: పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ప్రతి పథకంలోనూ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధపడే క్రమంలో బీజేపీ పరివర్తన్ మహాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని హాజరయ్యారు.
బిలాస్‌పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. రేషన్, మద్యం దగ్గర్నుంచి చివరకు ఆవు పేడనూ వారు వదల్లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా టైంలో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తే.. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని నిప్పులు చెరిగారు. అవినీతి పాలనలో ఈ రాష్ట్రం కూరుకుపోయిందని, కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్‌లోనూ ఓ స్కామ్ జరిగింది’’ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
చదవండి: లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడవాళ్ల హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment