బీజేపీ నేత కారుపై దాడి
ముంబై: ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారి ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ముంబైలో ఇంట్లో నుంచి ఆయన బయటకు వెళ్తుండగా రాళ్లు విసిరారు. ఇది ప్రత్యర్ధి పార్టీ కుట్ర అని, ఇలాంటి చర్యలకు తాను భయపడబోనని మనోజ్ తివారి అన్నారు.
'నాకు ముంబైలో ఇల్లు ఉంది. ఇక్కడ ఉంటున్నాను. నాకు ఇక్కడి ప్రజల మద్దతు ఉంది. ప్రత్యర్థి పార్టీ ఈ దాడికి పాల్పడి ఉంటుంది. వారు నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించారు. నేను ఇలాంటి వాటికి బెదరను. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు విచారణ చేస్తున్నారు' అని మనోజ్ తివారి చెప్పారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.