టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన తివారీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ఆదివారం ఘనంగా సన్మినించింది.
అతడిని గోల్డెన్ బ్యాట్‌తో బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన ఈడెన్ గార్డెన్స్‌లో రిటైర్మెంట్ అవ్వడం చాలా సంంతోషంగా ఉంది. కానీ నా కెరీర్‌లో బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు.
కాగా తన కెరీర్‌లో 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో 5,581, టీ20ల్లో 3,436 పరుగులు మనోజ్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున 12 వన్డేలు ఆడిన తివారీ 287 పరుగులు చేశాడు.
2011లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో తివారీ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌లకు ఆడాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభానికి ముందే అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ ప్రకటించాడు.
కానీ బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకే ఒక్కే సీజన్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత రంజీ సీజన్‌లో తివారీ భాగమయ్యాడు. ఇక 37 ఏళ్ల తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేబినెట్‌లో రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: #Dhruv Jurel: రెప్పపాటులో.. మెరుపులా కదిలిన జురెల్.. ‘సెంచరీ వీరుడి’ రనౌట్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment