మనోజ్‌ తివారీ ఇంటిపై దాడి | Delhi BJP chief Manoj Tiwari's house attacked | Sakshi
Sakshi News home page

మనోజ్‌ తివారీ ఇంటిపై దాడి

Published Mon, May 1 2017 9:32 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

మనోజ్‌ తివారీ ఇంటిపై దాడి

మనోజ్‌ తివారీ ఇంటిపై దాడి

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిమంది కలిసి తివారీ ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయాన్ని స్వయంగా తివారీనే తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ‘8-9మంది 159 నార్త్‌ అవెన్యూ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇది ముమ్మాటికీ దొంగదెబ్బే. ఈ ఘటనలో నా కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కూడా ఎడెనిమిదిమంది తివారీ ఇంటివద్ద అనవసర మాటలు అనుకుంటూ తిట్టుకుంటూ కనిపించారు. ఆ సమయంలో వారిని తివారీ ఇంటివద్ద పనిచేసే వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి దిగి ఆయన ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. అయితే, పోలీసులు మాత్రం ఇది రోడ్డుపై జరిగే చిల్లర పంచాయితీలాంటిదని, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. మనోజ్‌ తివారీ మాత్రం తనపై చేసిన కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. పోలీసుల హస్తం కూడా ఇందులో ఉందంటూ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement