సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు గురువారం ఆందోళన బాట పట్టారు. ఎన్నార్సీపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సీఎం నివాసం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. సీఎం డౌన్.. డౌన్ అంటూ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఎం కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) అమలైతే ఢిల్లీ నుంచి ముందుగా వెళ్లాల్సింది బీజేపీ నేత మనోజ్ తివారేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ అయిన మనోజ్ తీవారికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment