ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం తన ఛలోక్తులతో లోక్‌సభలో నవ్వులు పూయించారు. ‘నాకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అయినా.. నా భార్య అవేవీ పట్టించుకోదు’ అని అన్నారు.
ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్‌పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ’ అని ఓ పాట పాడారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు.