ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను కూడా ఆకాంక్షిస్తున్నానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని శుక్రవారం లోక్ సభలో చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని వెల్లడించారు. దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిల్లో పెట్టుకుని రాష్ట్రాలు వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నందునే ప్రత్యేక హోదా అడుగుతున్నామని వివరించారు.