ఎంపీ మనోజ్‌ తివారీని బంధించిన మహిళ | Woman Holds BJP MP Manoj Tiwari Hostage In Varanasi, Watch Inside Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీని బంధించిన మహిళ

Published Mon, May 27 2024 12:39 PM | Last Updated on Mon, May 27 2024 1:35 PM

Woman Holds BJP MP Manoj Tiwari Hostage

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసితో సహా 13 లోక్‌సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జూన్‌ ఒకటిన జరగనుంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంపై అధికంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వారణాసిలో పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారిలో ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా ఉన్నారు.

తాజాగా మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మనోజ్ తివారీ స్వయంగా షేర్‌ చేశారు. దానిలో ఒక మహిళ తనను బంధించారని తివారీ పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దాని ట్యాగ్‌లైన్‌గా ‘కాశీకి చెందిన ఒక మహిళ ఆమె కుమారునికి మనోజ్ తివారీని పరిచయం చేయడానికి బంధించినప్పుడు’ అని రాశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఆమె తన ఆమె తన కుమారునికి బీజేపీ ఎంపీని పరిచయం చేయడానికి కాల్ చేయడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.

మనోజ్ తివారీ వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆ మహిళ ఫోనులో అవతలి వ్యక్తికి చెప్పారు. ఈ క్లిప్‌ తరువాత మనోజ్ తివారీ ఒక బండి దుకాణం ముందు నిలబడటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది అక్కడ ఉండటాన్ని గమనించవచ్చు. గాయకుడైన మనోజ్ తివారీ పాడిన పాటలు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో  ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా అతని భోజ్‌పురి పాటలకు లెక్కకుమించిన అభిమానులున్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement