holds
-
ఎంపీ మనోజ్ తివారీని బంధించిన మహిళ
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసితో సహా 13 లోక్‌సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంపై అధికంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వారణాసిలో పలువురు బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వారిలో ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా ఉన్నారు.తాజాగా మనోజ్ తివారీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మనోజ్ తివారీ స్వయంగా షేర్ చేశారు. దానిలో ఒక మహిళ తనను బంధించారని తివారీ పేర్కొన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన దాని ట్యాగ్‌లైన్‌గా ‘కాశీకి చెందిన ఒక మహిళ ఆమె కుమారునికి మనోజ్ తివారీని పరిచయం చేయడానికి బంధించినప్పుడు’ అని రాశారు. ఈ వీడియోలో ఒక మహిళ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఆమె తన ఆమె తన కుమారునికి బీజేపీ ఎంపీని పరిచయం చేయడానికి కాల్ చేయడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.మనోజ్ తివారీ వచ్చి ఇంట్లో కూర్చున్నారని ఆ మహిళ ఫోనులో అవతలి వ్యక్తికి చెప్పారు. ఈ క్లిప్ తరువాత మనోజ్ తివారీ ఒక బండి దుకాణం ముందు నిలబడటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో చాలా మంది అక్కడ ఉండటాన్ని గమనించవచ్చు. గాయకుడైన మనోజ్ తివారీ పాడిన పాటలు ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఎంతో ఆదరణ పొందాయి. ముఖ్యంగా అతని భోజ్‌పురి పాటలకు లెక్కకుమించిన అభిమానులున్నారు. ప్రస్తుతం మనోజ్ తివారీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. जब मनोज तिवारी को काशी की एक महिला ने अपने बेटे से मिलवाने के लिये बनाया बंधक #ModiAgainIn2024 pic.twitter.com/U0aliTTmMY— Manoj Tiwari (मोदी का परिवार) 🇮🇳 (@ManojTiwariMP) May 27, 2024 -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
మరోసారి ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్ నిలిపివేత..!
అమెరికన్ మైక్రో-బ్లాగింగ్ సైట్, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది. వెరిఫికేషన్ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ట్విటర్ ఖాతాల బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడంలేదు. గతవారంలో పలు ఫేక్ ట్విటర్ ఖాతాలను తప్పుగా వెరిఫికేషన్ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్ నిర్థారించింది. ఇటీవల కాలంలో ట్విటర్ ఖాతాల ధృవీకరణ కోసం అప్లై చేసి ఉంటే వారికి బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "రాబోయే కొద్ది వారాల్లో బ్లూటిక్ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ట్విటర్ తన బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసింది. తాజాగా ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. -
అమెజాన్‌కు భారీ ఊరట : రిలయన్స్ డీల్‌కు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ ఊరట లభించింది. బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్‌కు బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసుకున్నఅభ్యర్థనపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా పరిణామంతో ఫ్యూచర్ గ్రూపు కొనుగోలుకు ప్రయత్నించిన ఆర్ఆర్వీఎల్ కంపెనీకి చుక్కెదురైంది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఎస్ఐఏసీ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఆర్ఆర్వీఎల్, ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాల కొనుగోలుకు 24,713 కోట్లు రూపాయల ఒప్పందం చేసుకుంది. అయితే ఫ్యూచర్ గ్రూప్ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెజాన్ వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్‌ను నిలుపుదల చేయాలని కోరింది. దీనిపై సింగపూర్ కేంద్రంగా ఉన్న సింగిల్-జడ్జ్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్ కూపన్స్‌లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది అమెజాన్ అప్పట్లో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరుతూ అమోజాన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని ఫ్యూచర్ గ్రూప్ భావిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ రీటైల్ స్పందన మరోవైపు ఈ పరిణామంపై రిలయన్స్ రీటైల్ అధికారికంగా స్పందించింది. దేశీయ చట్టాలకనుగుణంగానే, ఫ్యూచర్ గ్రూపునకు, ఆర్ఆర్వీఎల్ డీల్ ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంత తొందరగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. -
షాకిచ్చిన ఆస్ట్రాజెనెకా.. క్లినికల్ ట్రయల్స్‌కి బ్రేక్
లండన్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!) అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. -
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ద్రవ్య విధానం సమావేశం ముగిసిన అనంతరం మార్కెట్ అంచనాలను అనుగుణంగానే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. తమ వడ్డీ రేట్లను ఎలంటి మార్పులలేకుండా యధాతథంగా ఉంచినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది బ్యాంక్ ఆఫ్ జపాన్ మంగళవారం మానిటరీపాలసీ విధానాన్ని ప్రకటించింది. రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత విడుదలైన ఒక ప్రకటనలో డిపాజిట్ రేట్లను -0.1శాతం వద్ద 10 సంవత్సరాల లక్ష్యాన్ని జీరో శాతంగాను నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నెలలోనే దీర్ఘకాల ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను స్వల్పంగా తగ్గించింది. కాగా ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ప్రపంచ కేంద్ర బ్యాంకుల అడుగుజాడలను అనుసరిస్తుందనే ఊహాగానాలొచ్చాయి. దీనికి అనుగుణంగానే బీఓజే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. వినియోగదారుల ధర సూచిక నవంబరులో సంవత్సరం ప్రాతిపదికన 0.9 శాతం పెరిగింది, వరుసగా 11 వ నెల పెరుగుదల నమోదయింది. కాగా మెట్రిక్ ఒక రాయిటర్స్ పోల్ ప్రకారం, డిసెంబర్ లో అదే స్థాయి పెరుగుతుందని అంచనా. డిసెంబర్ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఆహార, ఇంధనం ధరలను మినహాయించిన వినియోగదారుల ధరలు నవంబర్‌లో కేవలం 0.3 శాతం పెరిగాయి. -
నాస్కామ్ అంచనాలపై ట్రంప్ ఎఫెక్ట్
ఐటి పరిశ్రమ యొక్క అత్యున్నత కమిటీ నాస్కామ్ తొలిసారి వెనకడుగు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమపై అంచనాలపై దూరంగా జరిగింది. నాస్కామ్ ఏర్పాటైన 25 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2018 ఆర్థిక సంవత్సర అంచనాలపై ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఆధారపడే ఐటీ పరిశ్రమ మందగింపు ప్రభావంతో ఈ వైఖరి తీసుకుంది. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాస్కామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో తాత్కాలికంగా పరిస్థితి అనిశ్చితంగా ఉందని పేర్కొంది. తమ నిపుణుల గణాంకాలు ఆధారంగా 6-10 శాతం వృద్ధి సలహా ఇచ్చినప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు చెప్పారు. మరో క్వార్టర్ వరకు తమ గైడెన్స్ అంచనాలను వాయిదా వేసుకున్నట్టు నాస్కాం ఛైర్మన్ సీపీ గుర్నాని తెలిపారు. అనేక అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రభావితమైనట్టు తెలిపారు. ఈ క్రమంలో తరువాతి త్రైమాసికంలో మాత్రమే అంచనాలను అందివ్వగలమని చెప్పారు. వినియోగదారులు, ఇతర వాటాదరారులతో లోతుగా చర్చించిన అనంతరం అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ, బిజనెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ సెక్టార్ల తరువాతి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను బహుశా మే నెలలో అందిస్తామన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న డిజిటల్ వార్ కారణంగా ఐటీ సెక్టార్ నైపుణ్యతలను పెంచుకోవాలని చెప్పారు. సుమారు 1.5 కోట్ల ఉద్యోగులకి తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో నైపుణ్యత శిక్షణ కావాలన్నారు. మరోవైపు 2017 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ వృద్ధి8.6 శాతం ఉండనుందని అంచనా. దీనిలో 12-15 శాతం ఐటి రంగంలో చోటుచేసుకోనున్న డిజిటల్ రంగానిదేనని విశ్లేషించారు. కాగా ఐటీ పరిశ్రమ గైడెన్స్‌పై 10-12 శాతంగా నిర్ణయించిన నాస్కామ్ తన అంచనాలను గత డిసెంబర్లో సవరించిన సంగతి తెలిసిందే. -
చెన్నైలో డీఎంకే నేతల నిరాహార దీక్ష
-
అశోక వృక్షంలో క్యాన్సర్ ఔషధం
బెంగళూరు: క్యాన్సర్ నిరోధానికి సాగుతున్న పరిశోధనలు ఊహకు అందని విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. గతంలో పసిఫిక్ యూ చెట్లలో ఉండే టాక్సాల్ అనే రసాయన సమ్మేళనం అశోకా చెట్లలో(సరాకా అశోకా) కూడా లభ్యమవుతోందని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఈ టాక్సన్ ‘ట్యూమర్ల’ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు లభ్యత కష్టంగా మారడంతో ప్రత్యామ్నాయాలపై పరిశోధన జరిగింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జీవశాస్త్ర విభాగం వివిధ రకాల ఔషధ మొక్కలపై గత దశాబ్ద కాలంగా జరిపిన అధ్యయనాల్లో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీంతో భారత్ శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరిగే బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు, అశోక వృక్షంపై క్యాన్సర్ నివారణలో మరిన్ని ఆశలు నెలకోనున్నాయి. ప్రసిద్ధ ఔషధ మొక్కల్లోని ఎండోఫిటిక్ ఫంగస్ పెరుగుదల, వాటి ఔషధ విలువల గుర్తింపు , సహజ పద్ధతిలో ఆయా కాంపౌండ్స్ వెలికితీత పై తమ సుదీర్ఘ పరిశోధనలో అశోక చెట్టు శిలీంధ్రంలో కొలెస్ట్రాల్ గ్లూకోజ్ అనే యాంటి క్యాన్సర్ కాంపౌండ్ ను గుర్తించామని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ జయభాస్కరన్ తెలిపారు. గతంలో పసిఫిక్ యూ చెట్టు బెరడు లో లభ్యమైన ఒక రసాయన సమ్మేళనం ప్రఖ్యాత టాక్సాన్ అశోక ఫంగస్ లో ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. మొక్క నుంచి వేరుచేసిన ఫంగస్ ను పులియబెట్టడానికి ముందే యాంటీ క్యాన్సర్ ఔషధ లక్షణాలను కలిగి ఉండడమని విశేషమని తెలిపారు. ఈ సమ్మేళాన్ని శుభ్రంచేసి, క్లినికల్, ప్రీ క్లినికల్ పరీక్షలకు వెళ్లాల్సి వుంటుందని తెలిపారు. దీంతోపాటుగా వివిధ రకాల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే అనేక మొక్కలు, చెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫంగస్ పై ఎఫ్‌డీఏ అనుమతి పొందాల్సి ఉందన్నారు. పరిశ్రమ స్థాయిలో ఈ శిలీంధ్రాన్ని ఔషధంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని జయచంద్రన్ పేర్కొన్నారు. -
కరెంటు కోతలకు చంద్రబాబు కారణమటూ TRS ఆందోళన