
అమెరికన్ మైక్రో-బ్లాగింగ్ సైట్, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది. వెరిఫికేషన్ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ట్విటర్ ఖాతాల బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడంలేదు. గతవారంలో పలు ఫేక్ ట్విటర్ ఖాతాలను తప్పుగా వెరిఫికేషన్ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్ నిర్థారించింది.
ఇటీవల కాలంలో ట్విటర్ ఖాతాల ధృవీకరణ కోసం అప్లై చేసి ఉంటే వారికి బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "రాబోయే కొద్ది వారాల్లో బ్లూటిక్ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ట్విటర్ తన బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసింది.
తాజాగా ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.