
సీలింగ్ డ్రైవ్ విషయంలో గొడవపడుతున్న బీజేపీ నేతలకు సర్దిచెబుతున్న కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన మద్దతుదారులు తమ వాళ్లను తీవ్రంగా అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న వివాదాస్పద సీలింగ్ డ్రైవ్ గురించి చర్చించేందుకు తమ పార్టీ నేత మనోజ్ తివారీ నేతృత్వంలో కేజ్రీవాల్ ఇంటికి వెళితే అవహేళన చేశారని, ఆయన మద్దతుదారులు దాడి చేశారని మండిపడింది. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది.
సీలింగ్ డ్రైవ్ విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లు రాగా, అక్కడ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, ఈ చర్చ మొత్తం కూడా మీడియా ఎదుట జరగాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయగా అందుకు బీజేపీ అంగీకరించనట్లు తెలిసింది. దీంతో ఎట్టి పరిస్థితిల్లో ఈ అంశంపై చర్చ బహిరంగంగానే జరగాలని చెప్పారు. ‘ఓ పక్క సమావేశం జరుగుతుండగానే బీజేపీ నేతల బృందం ముఖ్యమంత్రి (కేజ్రీవాల్) మాట వినకుండానే మధ్యలో వెళ్లిపోయింది. నిజంగా వర్తకుల విషయంలో బీజేపీ సీరియస్‌గా ఉన్నారా? లేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతినిధులుగా ఉన్నారా?’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment