sealing drive
-
ఢిల్లీలో వ్యాపారుల బంద్
సాక్షి, న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన దుకాణాల మూసివేత (సీలింగ్ డ్రైవ్)కు వ్యతిరేకంగా వ్యాపారులు ఇచ్చిన బంద్ పిలుపుతో బుధవారం ఢిల్లీలో 2500 మార్కెట్లు మూతపడ్డాయి. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ ఇండస్ర్టీస్ (సీటీఐ), అఖిలభారత వ్యాపారుల సంఘాల సమాఖ్య బంద్‌కు పిలుపు ఇచ్చింది. మరోవైపు రాంలీలా మైదాన్‌లో ఢిల్లీ వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ నిరసనకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, వేలాది చిన్న మధ్యతరహా సంస్థలు మద్దతివ్వడంతో బంద్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీటీఐ కన్వీనర్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ చెప్పారు. నగరంలోని చాందినీ చౌక్, సదర్‌బజార్, జనక్ పురి సహా పలు కీలక ప్రాంతాల్లోని మార్కెట్లు మూతపడ్డాయని తెలిపారు. ఢిల్లీ అధికారులు చేపట్టిన షాపుల మూసివేతతో 40 లక్షల మంది వ్యాపారులు, వారి కుటుంబాలు వీధినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణాలను సీల్ చేయడాన్ని నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లును లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దుందుడుకుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని విడిచిపెట్టిన అధికారులు కేవలం వ్యాపారులపై మాత్రమే విరుచుకుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆప్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ‘దుకాణాల మూసివేత’(సీలింగ్ డ్రైవ్)ని నిలిపివేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం రాజ్య సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి దుకాణాల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రైవేటు బిల్లుతో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. బిల్లుకు మిగతా పార్టీలు మద్దతు ఇవ్వాలని సంజయ్ సింగ్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు 14 ప్రయివేట్ బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. అయినా మేము ధైర్యంగా ఈ బిల్లు ప్రవేశ పెట్టాము. బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్నిమద్దతు ఇవ్వాల’ని విజ్ఞప్తి చేశారు. నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న దుకాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. సీలింగ్ డ్రైవ్ వల్ల వేలాదమంది వ్యాపారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టం చేయడం లేదా ఆర్డినెస్స్ జారీ చేయడం ఒక్కటే సీలింగ్ డ్రైవ్‌కు పరిష్కారమని ఆప్ తొలి నుంచి చెప్తోందని ఆయన గుర్తుచేశారు. -
ఆమరణ దీక్షకు దిగుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 31లోపు సీలింగ్ డ్రైవ్(షాపుల మూసివేత) నిలిపివేయకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణ సముదాయాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేస్తున్నారు. వ్యాపారులకు మద్ధతుగా నిలిచిన క్రేజీవాల్ అవసరమైతే వారి తరపున పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ‘వ్యాపారులు నిజాయితీగానే పన్నులు కడుతున్నారు. సీలింగ్ డ్రైవ్ వల్ల వేలాది మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంద’ని ఆయన చెప్పారు. పార్లమెంట్లో చట్టం చేయడం ఒక్కటే సీలింగ్ డ్రైవ్‌కు పరిష్కారమని కేజ్రీవాల్ సూచించారు. కేంద్రం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ... ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా పార్లమెంట్లో బిల్లు చేసి సీలింగ్ డ్రైవ్ ఆపేలా చొరవ చూపాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. -
మార్చి 31న కేజ్రీవాల్ నిరాహార దీక్ష..?
-
‘కేజ్రీవాల్ అవమానించారు.. దాడి చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన మద్దతుదారులు తమ వాళ్లను తీవ్రంగా అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న వివాదాస్పద సీలింగ్ డ్రైవ్ గురించి చర్చించేందుకు తమ పార్టీ నేత మనోజ్ తివారీ నేతృత్వంలో కేజ్రీవాల్ ఇంటికి వెళితే అవహేళన చేశారని, ఆయన మద్దతుదారులు దాడి చేశారని మండిపడింది. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. సీలింగ్ డ్రైవ్ విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లు రాగా, అక్కడ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, ఈ చర్చ మొత్తం కూడా మీడియా ఎదుట జరగాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయగా అందుకు బీజేపీ అంగీకరించనట్లు తెలిసింది. దీంతో ఎట్టి పరిస్థితిల్లో ఈ అంశంపై చర్చ బహిరంగంగానే జరగాలని చెప్పారు. ‘ఓ పక్క సమావేశం జరుగుతుండగానే బీజేపీ నేతల బృందం ముఖ్యమంత్రి (కేజ్రీవాల్) మాట వినకుండానే మధ్యలో వెళ్లిపోయింది. నిజంగా వర్తకుల విషయంలో బీజేపీ సీరియస్‌గా ఉన్నారా? లేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతినిధులుగా ఉన్నారా?’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది.