
గత రాత్రి మంత్రి అనుచరులు కొందరు స్థానికంగా దళితులకు చీరలు..
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. కన్నడనాట సిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. అయితే.. తాజాగా కర్ణాటక క్రీడాశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ఇంటిపైకి దళితులు ఆగ్రహంతో దూసుకొచ్చారు.
గత రాత్రి మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు స్థానికంగా కొందరికి చీరలు పంపిణీ చేశారు. అయితే.. ఆ చీరలను ఈ ఉదయం మంత్రి ఇంటి ముందు విసిరేసిన దళితులు నిరసన తెలిపారు. ఆపై వాళ్లు మంత్రి నివాసంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనే సంగతిపై స్పష్టత కొరవడింది.
ఆటో నడిపిన పీసీసీ చీఫ్.. మరిన్ని సిత్రాల కోసం క్లిక్ చేయండి