రాజకీయ గిమ్మిక్కే
Published Sat, Jan 11 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
సాక్షి, న్యూఢిల్లీ: జనతాదర్బార్ పేరిట ఆప్ సర్కార్ ఢిల్లీవాసులను అవమానిస్తోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రాజకీ య గిమ్మిక్కుల కోసమే ఆప్ సర్కార్ యత్నిస్తోంద ని దుయ్యబట్టారు. వందలాది మంది ప్రజలు వస్తే ఏ ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపలేకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని విమర్శించా రు. ‘జనతాదర్బార్’ పేరిట ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీ లోని కోటీ అరవై లక్షల మంది సమస్యలు రోడ్లపై కూర్చు ని తీర్చడం సాధ్యం కాదనే కనీస విషయం జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.
ఒక వేళ ప్రజల సమస్యలు పరిష్కరించాలని వారికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయం లోపలే ఆయా విభాగాల వారీగా మంత్రులుతెలుసుకోవచ్చు. సమస్యలకు పరిష్కరిం చవచ్చు. కానీ సీఎం కేజ్రీవాల్ చేస్తోంది రాజకీయ జిమ్మిక్కులు’అంటూ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల గడువు ముంచుకొస్తుండడంతో వీలైనంత ఎక్కువ ప్రచారం పొందేందుకే ఇలాంటి పద్ధతులకు దిగుతున్నారని ఆరోపించారు. వలంటీర్ల పేరిట ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆప్ సర్కార్ యత్నిస్తోందన్నారు. ఇది పరిపాలనా ప్రక్రియకు అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. వాస్తవానికి 10 రోజులుగా ఢిల్లీలో పాలన పూర్తిగా చిన్నాభిన్నంగా మారిందన్నారు. రాజకీయ ప్రయోజనాలు మానుకుని ప్రజాప్రయోజనాలు కాపాడే పనులు చేయాలని సూచించారు.
Advertisement