janata darbar
-
జనతా దర్బార్‌కు సమస్యల వెల్లువ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు ఉద్యోగులు, జర్మన్ లాంగ్వేజ్ టీచర్లు పలు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అందరి విన్నపాలను ఓపిగ్గా విన్న కేజ్రీవాల్ వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కాగా, కేజ్రీవాల్ బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత దీనిని నిర్వహించడం ఇది రెండోసారి. ప్రభుత్వం తరఫున ఎయిడ్స్ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించే 30 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సీఎంను కలిసి తమ జీతాల కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లినప్పటి నుంచి ఎయిడ్స్ ప్రచార కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో తమకు జీతాలు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. మరోవైపు సుమారు 25 మంది జర్మన్ టీచర్లు సీఎంను కలిసి జర్మన్ భాషను రాష్ట్ర పరిధిలోని పాఠశాలల పాఠ్యప్రణాళిక చేర్చాలని కోరారు. తద్వారా తాము జీవించడానికి చేయూతనివ్వాలని అభ్యర్థించారు. జర్మన్ భాషను కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో మూడో భాషగా చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పారు. దీంతో జర్మన్ భాష స్థానంలో మరో దానికి వీలు కల్పించిందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల సుమారు 1,000 మంది టీచర్లు, ఏడు వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించి, తమకు ఉపాధినివ్వాలని కోరారు. అనంతరం సమస్యలు విన్నవించడానికి వచ్చిన అనేక మంది దగ్గర్నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. -
కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ బుధవారం మొట్టమొదటిసారిగా జనతాద ర్బార్ నిర్వహించారు. ఇందులోభాగంగా ఘాజియాబాద్‌లోని కౌశాంబీలో గల ఆప్ కార్యాలయం వద్ద ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల్ని ఆలకించారు. ఈ దర్బార్‌కు దాదాపు దాదాపు వెయ్యి మంది ప్రజలు వచ్చారు. వారిలో కొందరు తమ సమస్యల్ని చెప్పుకోగా, మరికొందరు సీఎంకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. మరికొందరు ఫొటోలు దిగారు. ఈ దర్బార్‌కు వచ్చిన వారి సమస్యలను ముఖ్యమంత్రి ఓపిగ్గా ఆలకించారు. ఫిర్యాదుల్లో అత్యధికం పోలీసులకు సంబంధించినవేనని అధికారులు చెప్పారు. 12 గంటల తరువాత కేజ్రీవాల్ జనతా దర్బార్ ముగించి సచివాలయానికి బయల్దేరారు. జనతాదర్బార్‌లో గందగోళం తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వాధికారులతోపాటు ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. ఇదిలాఉంచితే జాతీయ రాజధానిలో అధికారిక నివాసం లభించేంతవరకు కేజ్రీవాల్ కౌశాంబీలోనే వారానికి మూడు రోజులు జనతాదర్బార్ నిర్వహిస్తారని తెలియవచ్చింది. బుధ, గురు, శుక్రవారాలు జనతాదర్బార్ నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు అనుమతించారు. ఇందులోభాగంగా భద్రతతోపాటు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంవల్లనే బుధవారం జనతాదర్బార్‌కు తక్కువమంది వచ్చారని, మున్ముందు వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు . ఇక మంత్రులు కూడా కార్యాలయాలలో కాకుండా తమ విధానసభ నియోజకవర్గం పరిధిలోని తమ కార్యాలయాల్లో ప్రజలను కలుస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాగా గతంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సచివాలయం వద్ద జనతాదర్బార్ నిర్వహించిన జనతాదర్బార్ రసాభసగా మారిన సంగతి విదితమే. దీంతో ఆప్ సర్కారు, ప్రభుత్వ అధికారులు ఈసారి మెరుగైనఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ వద్ద అనేక విభాగాలు ఉండేవి. అయితే ఈసారి తన వద్ద ఏ మంత్రిత్వ శాఖను ఉంచుకోలేదు.ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి తగినంత సమయం ఉంటుందని ఆప్ వర్గాలు అంటున్నాయి. ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగాన్ని నిర్థారించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ముున్సిపల్ సంస్థలకొకరోజు, డీజేబీ సమస్యలకు ఒకరోజు, విద్యుత్తు సమస్యలకు ఒకరోజు... ఇలా వేర్వేరు రోజుల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అన్నిరకాల సమస్యలతో ప్రజలు ఒకే రోజు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినట్లయితే గందరగోళం తలెత్తవచ్చని, ఈ కారణంగా ఎవరికీ సంతృప్తి కలగకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదుదారులకు ఎస్ఎంఎస్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో జనతా దర్బార్లు నిర్వహించే దిశగా ఆప్ సర్కారు యోచిస్తోందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలోనే జరుగుతాయని అంటున్నారు. ఆప్ మంత్రులు సత్యేంద్ర జైన్, జితేంద్రసింగ్ తోమర్ బధవారం తమ కార్యాలయాల్లో ప్రజలను కలసి వారి సమస్యలను ఆలకించారు. సత్యేంద్ర జైన్ సరస్వతీ విహార్‌లోని తన కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలను కలవడం ప్రారంభించారు. దాదాపు 150 మంది ఆయనను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ వద్దకు వచ్చినవారిలో ఎక్కువ మంది సర్సరీ ప్రవేశాలకు సంబంధించి ఫిర్యాదులను అందజేశారు. మంత్రి తమ సమస్యలను ఓపికగా విన్నారని, ఆయనను కలవడానికి వచ్చినవారు చెప్పారు. తొలిసారిగా మంత్రి బాధ్యతలను చేపట్టిన జితేంద్ర సింగ్తోమర్ కూడా ఉదయం తొమ్మిది గంటలకే తన కార్యాలయానికి వచ్చి ప్రజలను కలిశారు. న్యాయశాఖ మంత్రి అయిన తోమర్ వద్దకు వచ్చిన వారిలో కొందరు సమస్యలను చెప్పుకోగా, మరికొందరు ఆయనను అభినందించారు. -
సీఎం గారూ.. మీరు భలే సుందరాంగులు!!
ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. ఏకంగా ఐదు లక్షల మంది గత రెండు సంవత్సరాలలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖల మీద లేఖలు రాశారు. ఆయన జనతా దర్బార్, ముఖ్యమంత్రికి లేఖలు అనే కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ''ముఖ్యమంత్రి గారూ, మీరు చాలా అందంగా ఉంటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా'' అని వాటిలో చాలా లేఖలున్నాయి. అలాగే ఇంకా.. ''ముఖ్యమంత్రి గారూ, నా దగ్గర బొలెరో వాహనం లేదు. మీరు ఇస్తారా?'' అని, ''నేను మిమ్మల్ని సోదరుడిగా భావిస్తున్నాను. మీకు రాఖీ కట్టచ్చా'' అని.. ఇలా లెక్కలేనన్ని ఉత్తరాలు అఖిలేష్ యాదవ్‌కు వచ్చాయి. ఈ ఉత్తరాలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం కోసం ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించేందుకు ఓ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్లు ఓ డజను మంది కంప్యూటర్ నిపుణులను రంగంలోకి దించి, ప్రతిదానికీ బార్ కోడింగ్ చేసి, డిజిటైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఆఫీసు ఏర్పాటు చేసింది. అందులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. దాదాపు 4.75 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 65 వేలకు తప్పనిసరిగా సమాధానాలివ్వాలని గుర్తించి, వాటిని సీఎం వద్దకు పంపుతున్నారు. -
ఇక జనతా దర్బార్ ఉండదు
ఆన్లైన్లో సమస్యలు చెప్పుకోవచ్చు: కేజ్రీవాల్ హాట్లైన్లను ఏర్పాటుచేస్తాం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన జనతాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇకపై జనతాదర్బార్ ఉండబోదని, ఆన్లైన్లో కానీ, హెల్ప్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను త్వరలో ప్రకటిస్తారని, సెక్రటేరియట్లో కూడా త్వరలో ఒక హెల్ప్బాక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఊహించని స్థాయిలో ప్రజలు రావడం, నిర్వహణ లోపంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ సచివాలయ ఆవరణలో మొట్టమొదటిసారిగా శనివారం నిర్వహించిన జనతా దర్బార్ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పటిష్ట ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్‌ను ఏర్పాటుచేస్తామని అప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తనను ప్రత్యక్షంగా కలవాలనుకునేవారి కోసం వారంలో ఒక రోజు రెండు నుంచి మూడుగంటల సమయం కేటాయిస్తానన్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతపై, వాటర్ ట్యాంకర్ మాఫియా, టెండర్ మాఫియా నుంచి ముప్పు ఉందన్న ఐబీ నివేదికలపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు భద్రత అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రులకు, మంత్రులకు భద్రత కల్పించడం ముఖ్యం కాదు. సామాన్యులకు రక్షణ కల్పించాలి’ అన్నారు. ఆప్‌కు జైకొట్టిన మేధా పాట్కర్ ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 200 ప్రజా సంఘాలతో ఏర్పడిన ‘నేషనల్ అలయెన్స్ ఫర్ పీపు ల్స్ మూవ్మెంట్స్’ కూటమికి మేధాపాట్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడు దేన్నీ తోసిపుచ్చలేను. రాజకీయాలు అంటరానివని మేం భావించడం లేదు. మా ఆలోచనలు ఆ పార్టీ ఆలోచనలకు సారూప్యత ఉంది’ అని ఆమె చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. మోడీకి బదులు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను ప్రధాని బరిలో దించాలి’ అని ఆప్ సూచించింది. -
జనతా దర్బార్ కు ముగింపు పలికిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రజల సమస్యల పరిష్కారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా దర్బార్ అర్థాంతరంగా ముగిసింది. ఇకమీదట జనతా దర్భార్ నిర్వహించేది లేదని కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. వారానికి ఒకసారి తానే స్వయంగా ప్రజలను కలవనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ కష్టాలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తేవడం కోసం జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిర్వహణ కష్టతరం కావటంతో .... ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు జనతా దర్బార్ కు ముగింపు పలకటంతో సామాన్య ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. కాగా కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ సచివాలయం వద్ద నిర్వహించిన మొట్టమొదటి జనతా దర్బార్‌కు జనం వెల్లువెత్తటంతో రసాభాసగా మారింది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావటంతో ప్రభుత్వం చేసిన ఏరాట్లు, నియంత్రణ చర్యలు ఏమాత్రం సరిపోలేదు. జనం బారికేడ్లను కూలదోసి ముందుకు రావటం, సీఎంను కలవటానికి పోటీపడటంతో పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర గందరగోళం తలెత్తటంతో కేజ్రీవాల్ అర్ధంతరంగా జనతాదర్బార్‌ను నిలిపివేశారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిన అనంతరం మరో వారం రోజుల్లోపలే మళ్లీ జనతాదర్బార్‌ను నిర్వహిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జనతా దర్బార్ నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో జనతా దర్బార్‌ను ఆప్ సర్కార్ ఆదిలోనే అటకెక్కించింది. -
పాలనా వైఫల్యమే..!
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా దర్బార్ మొదటి రోజే అభాసుపాలైంది. లెక్కకు మించి ప్రజలు హాజరు కావడంతో అధికారులు చేష్టలుడిగి ఉండిపోయారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శనివారం ముఖ్యమంత్రి స్వయంగా హాజరై జనతా దర్బార్‌ను నిర్వహిస్తారని ఆప్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో మొదటి జనతా దర్బార్‌ను నిర్వహించారు. దీనికి అధికారు లు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది ప్రజలు హాజరవ్వడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ గందరగోళంలో ముఖ్యమంత్రి దర్బార్‌ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా, పాలనా విభాగానికి ముందు చూపు లోపించడం వల్లే జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొందని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంత రక్షణ చర్యలు తీసుకున్నా పాలనాశాఖ సరైన ప్రణాళికతో ముందుకు రాకపోతే ఇలాం టి పరిస్థితులే ఎదురవుతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మేం జనతా దర్బార్ రక్షణకు ఎంతమంది సిబ్బందినైనా నియమించగలం. కాకపోతే దానివల్ల దర్బార్ లక్ష్యం నెరవేరదు. సామాన్యులెవరూ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోలేరు.. దాని బదులు జనతా దర్బార్‌ను ప్రాంతాల వారీగా, మంత్రిత్వశాఖల వారీగా, విషయాల వారీ గా నిర్వహిస్తే మరింత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటుచేయడానికి మాకు వీలు పడుతుంది..’ అని ఒక సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. జనతా దర్బార్ ప్రాంతంలో సుమారు 500 మంది పోలీసులను,మరో 500 మంది పారా మిలటరీ దళాలను భద్రతకు ఏర్పాటుచేశారు. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ల అత్యుత్సాహం వల్ల జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజెన్లు, వికలాంగు లు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఎలా విన్నవించుకోగలుగుతారని వారు ప్రశ్నించారు. అటువంటి వారి కోసం ప్రత్యేక సమయం, స్థలం కేటాయిస్తే జనతా దర్బార్‌కు వచ్చి కష్టపడాల్సిన అవసరం ఉండదు..’ అని సూచించారు. మొదటి జనతా దర్బార్ గురించి ఆప్ ప్రభుత్వం ఎక్కువగా ప్రచారం చేసింది. అధికారుల ఏర్పాట్ల లోపంతో సెక్రటేరియట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం గందరగోళమైంది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యలోనే బలవంతంగా ఆ స్థలం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా, అనంతరం సీఎం మాట్లాడుతూ తాను దర్బార్‌ను మధ్యలో విడి చి వెళ్లిపోలేదన్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా భవిష్యత్‌లో శాశ్వత చర్యలు తీసుకుంటునామని హామీ ఇచ్చారు. జనతా దర్బార్ నిర్వహించేది ఇలాగేనా: కిరణ్ బేడీ ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో జనతాదర్బార్ నిర్వహించడంపై కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును శనివారం మాజీ పోలీస్ అధికారి కిరణ్ బేడీ విమర్శించారు.‘దేవుడి దయ వల్ల కేజ్రీవాల్, అతని మం త్రివర్గ సభ్యులు సెక్రటేరియట్ మీద ఎక్కి పరుగు లు పెట్టాల్సిన పరిస్థితి తప్పింది. ఇప్పటికైనా పరిస్థితులను ఆకళింపు చేసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడితే బాగుంటుంది..’ అని ట్విట్టర్లో కేజ్రీవాల్‌కు ఆమె సలహా ఇచ్చా రు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ఇన్చార్జి షకీల్ అహ్మద్ జనతా దర్బార్ ఫ్లాప్ షోగా మారడంపై ప్రతిస్పందిస్తూ ..‘ఇది కొత్త ప్రభుత్వం. అనుభవ రాహిత్యం వల్ల కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా కేజ్రీవాల్ సర్కారు చర్యలు తీసుకోవాలి..అని అన్నారు. -
మమ్మల్ని క్షమించండి..
న్యూఢిల్లీ: ‘ తప్పిదం జరిగింది. మేం అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు జనతాదర్బార్‌కు వచ్చారు. వారికి సరిపడా ఏర్పాట్లు చేయడంలో మేం విఫలమయ్యాం..ఈసారికి మమ్మల్ని క్షమించండి.. మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుం టాం..ఈ రోజుకి అందరూ ఇళ్లకు వెళ్లిపోండి..’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆప్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొట్టమొదటి ‘జనతాదర్బార్’ రసాభాసగా ముగిసిన విషయం తెలిసిందే. వందలాదిమంది ఒకేసారి తమ ఫిర్యాదులు సీఎంకు ఇచ్చేందుకు యత్నిం చడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేకపోయారు. తాకిడి తట్టుకోలేక సీఎం దర్బార్ మధ్యలోనుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం ఆయ న తిరిగి సెక్రటేరియట్ బయటకు వచ్చి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. కాగా గందరగోళం సద్దుమణిగిన తర్వాత కేజ్రీవాల్ మంత్రివర్గ సభ్యులైన మనీష్ ససోడియా, రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీలు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారికి రసీదులు ఇచ్చారు. వారి చెప్పిన విషయాలను సాదరంగా విన్నారు. అలాగే డీడీఏ, పోలీ స్, మూడు ఎంసీడీల నుంచి పలువురు సీని యర్ అధికారులు సైతం ఈ దర్బార్‌కు హాజరయ్యారు. అయితే ఇంత గందరగోళంలోనూ కొన్ని వందల మంది తమ ఫిర్యాదులను దర్బార్‌లో అందజేయగలిగారు. ఉదయం 6 గంటలకే సెక్రటేరియట్‌కు చేరుకున్న తూర్పుఢిల్లీలోని మండవలీ ప్రాంతానికి చెందిన సునీతా అగర్వాల్ మాట్లాడుతూ..‘ మా ఇంటిని కొందరు ఆక్రమించుకున్నారు. ఆ విషయమై సీఎంకు వినతిపత్రం ఇచ్చా. ఆయన తొందర్లోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..’ అని చెప్పారు. రేడియో ట్యాక్సీ డ్రైవర్ల సమస్యపై తాను ఇచ్చిన వినతిపై రవాణా మంత్రి సౌరభ్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే చర్చలకు పిలుస్తానని హామీ ఇచ్చారని ఎకానమీ రేడియో ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మురళీధర్ తెలి పారు. జనతాదర్బార్‌లో గందరగోళం వల్ల చాలామంది సీఎంను కలవలేకపోయారు. ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ సీఎం కేజ్రీవాల్‌ను కలిసి గులాబీని బహుమతిగా ఇవ్వాలని వచ్చిన 24 ఏళ్ల మమతా శర్మ అనే వికలాంగురాలు సెక్రటేరియట్ గేట్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటల వరకు వేచి ఉంది. ఆమె మాట్లాడుతూ..‘ కేజ్రీవాల్ నాకు ఆదర్శం. నేను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకుంటున్నాను. అతడిని కలిసి ఈ గులాబీ ఇచ్చి అభినందించాలని వచ్చా.. అయితే ఇంతమందిలో నా అంగవైకల్యం వల్ల అతడిని కలవలేకపోయాను. నేను ఉదయం ఇక్కడికి వచ్చినపుడు ఈ పువ్వు చాలా తాజాగా ఉంది. ఇప్పుడుచూడండి.. రెక్క లు రాలిపోయా’ని ఆమె వ్యాఖ్యానించారు. ‘మా అందరి పరిస్థితీ ఇలాగే ఉంది.. ఇక్కడ ఒక పద్ధతి లేదు.. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు.రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చాను. కాని సీఎంను కలవలేకపోయాను. మున్ముందైనా మహిళలు, వికలాంగులు, వృద్ధుల కోసం సీఎం ప్రత్యేక ఏర్పాట్లు చేయించాలని కోరుతున్నాను..’ అని మరో వికలాంగుడు తెలిపాడు. ఎలక్ట్రిక్ వీల్ చైర్లో వచ్చిన బిట్టో అనే మరో వికలాంగుడు మాట్లాడుతూ ‘నాకు పోలియో ఉండటంతో ఎవరూ పని ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. సొంతంగా దుకాణం పెట్టుకోవాలని అనుకొన్నాను. ఇంతకుముందు సీఎం షీలాదీక్షిత్‌ను కలుద్దామనుకున్నా సాధ్యం కాలేదు. ఇప్పుడు కేజ్రీవాల్‌ను కలవడానికి వచ్చాను. కలవలేకపోయాను..దురదృష్టం వెంటాడుతూనే ఉంద’ని వాపోయాడు. 2013, డిసెంబర్ 19 సామూహిక అత్యాచారానికి గురైన మహిళ సైతం సీఎంను కలవడానికి కుటుంబసభ్యులతో వచ్చింది.‘ నేను కేసు పెట్టాను. ఇద్దరి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాని వారిని అరెస్టు చేయలేదు. వారు రోజూ వచ్చి మమ్నల్ని బెదిరిస్తున్నారు..’ అని ఆమె సోదరుడు ఫిర్యాదుచేశాడు. న్యాయశాఖ మంత్రి సోమంత్ భారతి ఆదేశానుసారం పోలీసులు ఆమెను ఐటీవో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నారు. -
రాజకీయ గిమ్మిక్కే
సాక్షి, న్యూఢిల్లీ: జనతాదర్బార్ పేరిట ఆప్ సర్కార్ ఢిల్లీవాసులను అవమానిస్తోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రాజకీ య గిమ్మిక్కుల కోసమే ఆప్ సర్కార్ యత్నిస్తోంద ని దుయ్యబట్టారు. వందలాది మంది ప్రజలు వస్తే ఏ ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపలేకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని విమర్శించా రు. ‘జనతాదర్బార్’ పేరిట ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని ఆరోపించారు. ‘ఢిల్లీ లోని కోటీ అరవై లక్షల మంది సమస్యలు రోడ్లపై కూర్చు ని తీర్చడం సాధ్యం కాదనే కనీస విషయం జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. ఒక వేళ ప్రజల సమస్యలు పరిష్కరించాలని వారికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయం లోపలే ఆయా విభాగాల వారీగా మంత్రులుతెలుసుకోవచ్చు. సమస్యలకు పరిష్కరిం చవచ్చు. కానీ సీఎం కేజ్రీవాల్ చేస్తోంది రాజకీయ జిమ్మిక్కులు’అంటూ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల గడువు ముంచుకొస్తుండడంతో వీలైనంత ఎక్కువ ప్రచారం పొందేందుకే ఇలాంటి పద్ధతులకు దిగుతున్నారని ఆరోపించారు. వలంటీర్ల పేరిట ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆప్ సర్కార్ యత్నిస్తోందన్నారు. ఇది పరిపాలనా ప్రక్రియకు అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. వాస్తవానికి 10 రోజులుగా ఢిల్లీలో పాలన పూర్తిగా చిన్నాభిన్నంగా మారిందన్నారు. రాజకీయ ప్రయోజనాలు మానుకుని ప్రజాప్రయోజనాలు కాపాడే పనులు చేయాలని సూచించారు. -
ఆప్‌కు మద్దతుగా మణికట్టు కోసుకున్న యువకుడు
ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఓ యువకుడు ఆ పార్టీకి మద్దతిస్తున్నానని చెప్పుకోడానికి మణికట్టు కోసుకున్నాడు. కౌశాంబి ప్రాంతంలోని తన నివాసం వద్ద అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు వరుసగా మూడో రోజు జనతా దర్బార్ నిర్వహించారు. ఉన్నట్టుండి అహ్మద్ జమీల్ (25) అనే వ్యక్తి లేచి నిల్చుని, ఓ బ్లేడు తీసుకుని మణికట్టు కోసేసుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ తాను స్వాతంత్ర్యం ఇస్తాను, దానికి బదులు రక్తం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారని, అలాగే కేజ్రీవాల్ భారత దేశాన్ని అవినీతి బారి నుంచి రక్షిస్తారని జమీల్ చెప్పాడు. తాను అరవింద్ కేజ్రీవాల్ వెంటే ఉంటానని, ఆయన కోసం ఏమైనా చేస్తానని అన్నాడు. ఈలోపు పార్టీ కార్యకర్తలు అతడిని చుట్టుముట్టి, కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి చికిత్స చేసి విడిచిపెట్టారు.