న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు ఉద్యోగులు, జర్మన్ లాంగ్వేజ్ టీచర్లు పలు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అందరి విన్నపాలను ఓపిగ్గా విన్న కేజ్రీవాల్ వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కాగా, కేజ్రీవాల్ బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత దీనిని నిర్వహించడం ఇది రెండోసారి. ప్రభుత్వం తరఫున ఎయిడ్స్ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించే 30 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సీఎంను కలిసి తమ జీతాల కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లినప్పటి నుంచి ఎయిడ్స్ ప్రచార కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో తమకు జీతాలు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. మరోవైపు సుమారు 25 మంది జర్మన్ టీచర్లు సీఎంను కలిసి జర్మన్ భాషను రాష్ట్ర పరిధిలోని పాఠశాలల పాఠ్యప్రణాళిక చేర్చాలని కోరారు. తద్వారా తాము జీవించడానికి చేయూతనివ్వాలని అభ్యర్థించారు. జర్మన్ భాషను కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో మూడో భాషగా చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పారు. దీంతో జర్మన్ భాష స్థానంలో మరో దానికి వీలు కల్పించిందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల సుమారు 1,000 మంది టీచర్లు, ఏడు వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించి, తమకు ఉపాధినివ్వాలని కోరారు. అనంతరం సమస్యలు విన్నవించడానికి వచ్చిన అనేక మంది దగ్గర్నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.
జనతా దర్బార్‌కు సమస్యల వెల్లువ
Published Thu, Mar 19 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement