ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఓ యువకుడు ఆ పార్టీకి మద్దతిస్తున్నానని చెప్పుకోడానికి మణికట్టు కోసుకున్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఓ యువకుడు ఆ పార్టీకి మద్దతిస్తున్నానని చెప్పుకోడానికి మణికట్టు కోసుకున్నాడు. కౌశాంబి ప్రాంతంలోని తన నివాసం వద్ద అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు వరుసగా మూడో రోజు జనతా దర్బార్ నిర్వహించారు. ఉన్నట్టుండి అహ్మద్ జమీల్ (25) అనే వ్యక్తి లేచి నిల్చుని, ఓ బ్లేడు తీసుకుని మణికట్టు కోసేసుకున్నాడు.
సుభాష్ చంద్రబోస్ తాను స్వాతంత్ర్యం ఇస్తాను, దానికి బదులు రక్తం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారని, అలాగే కేజ్రీవాల్ భారత దేశాన్ని అవినీతి బారి నుంచి రక్షిస్తారని జమీల్ చెప్పాడు. తాను అరవింద్ కేజ్రీవాల్ వెంటే ఉంటానని, ఆయన కోసం ఏమైనా చేస్తానని అన్నాడు. ఈలోపు పార్టీ కార్యకర్తలు అతడిని చుట్టుముట్టి, కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి చికిత్స చేసి విడిచిపెట్టారు.