
ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఓ కేటుగాడి చేతిలో మోసపోయింది. వివరాల ప్రకారం.. ఓ ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మలనుకున్న హర్షితకు కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. మొదట కొద్ది మొత్తంలో డబ్బును హర్షితా అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఆమెను నమ్మించాడు. తర్వాత హర్షిత పంపిన క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఆమె అకౌంట్‌లోని 34వేల రూపాయలను దోచేశాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment