'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్' | central minister vijay goel praises double bed room homes | Sakshi
Sakshi News home page

'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్'

Published Tue, Jan 3 2017 12:24 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్' - Sakshi

'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్'

  • డబుల్ బెడ్‌రూమ్‌ పథకం భేష్‌: విజయ్ గోయల్
  • సిద్దిపేట: తెలంగాణ సర్కార్ అమలు చేస‍్తున‍్న డబుల్ బెడ్‌రూమ్‌ పథకం అందరికీ ఆదర‍్శంగా ఉందని, పేదలకు ఉపయోగపడే చక‍్కని పథకాన‍్ని అమలుచేస‍్తున‍్న సర్కార్‌ను అభినందిస్తున్నట్లు కేంద్ర మంత్రి విజయ్ గోయల్‌ చెప్పారు. కేంద్ర మంత్రి గోయల్ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో పర్యటించారు. కేంద్ర మంత్రికి ఎర్రవల్లి సర‍్పంచ్‌ ఘన స్వాగతం పలికారు. మర్కుర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఆయన డబుల్ బెడ్ రూమ్‌ ఇళ‍్లను పరిశీలించారు.

    అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ‍్లు చక‍్కగా ఉన్నాయని, ఈ పథకం దేశానికే ఆదర‍్శంగా ఉందని గోయల్ చెప్పారు. ముఖ‍్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన‍్ని సుసాధ‍్యం చేశారన్నారు. ఈ పథకంపై ప్రధాని మోదీతో చర్చించి దేశ వ్యాప‍్తంగా అమలయ‍్యేలా చూస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట‍్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున‍్న నిర‍్ణయాన్ని సమర్థించినందుకు సీఎం కేసీఆర్ కు విజయ్ గోయల్ కృతజ‍్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement