బీజేపీ ఎంపీకి జరిమానా | BJP MP Vijay Goel fined for violating odd-even scheme | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీకి జరిమానా

Published Mon, Apr 18 2016 11:57 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

బీజేపీ ఎంపీకి జరిమానా - Sakshi

బీజేపీ ఎంపీకి జరిమానా

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు 2 వేల రూపాయల జరిమానాను విధించారు.

ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు నిరసనగా సరి-బేసి నిబంధనను ఉల్లంఘిస్తానని సోమవారం ఉదయం విజయ్ గోయెల్ చెప్పారు. ఢిల్లీ రవాణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. ఆయనకు రోజా పూలు ఇచ్చి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరినా మెత్తబడలేదు. సరి-బేసి నిబంధనకు తాను వ్యతిరేకంగా కాదని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని గోయెల్ స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement