హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రం
కేంద్ర మంత్రి విజయ్ గోయల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రాంతీ య క్రీడల కేంద్రం (రీజినల్ స్పోర్ట్స్ సెంట ర్) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే పనులు చకచకా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధమని ఈ సందర్భంగా మంత్రిని కేసీఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన గోయల్.. క్రీడల కేంద్రం ఏర్పా టుకు హామీ ఇచ్చారు. వరంగల్, లక్న వరంను మంగళవారం సందర్శిస్తానని చెప్పారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు.
నగరంలోని సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘శక్తిమాన్’ 35వ ఆలిండియా పోలీస్ ఎక్వెస్ట్రెస్ చాంపి యన్ షిప్ పోటీలను సోమవారం గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో అశ్వక దళాల పాత్ర కీలకమని.. రామాయణం, మహాభారత కాలం నుంచే వాటి పాత్ర ఎనలేనిదన్నారు. అకాడమీ డైరెక్టర్ బహు గుణ మాట్లాడుతూ.. ‘శక్తిమాన్’ పోటీల్లో 18 బృందాలు, 460 మంది రైడర్లు, 290 గుర్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు.