సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిత్యావసరాల ధరలను మరింత మండించేందుకేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పర మద్దతుతోనే వంటగ్యాస్, సీఎన్ జీ, నీటి చార్జీలను పెంచుతున్నాయని విమర్శిం చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ధరలు పెంచుతుంటే వారికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ధరలు పెంచుతోంది. వెంటనే సీఎన్‌జీ,వంటగ్యాస్, నీటి బిల్లులు తగ్గించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.220 పెంచ డం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడనుందన్నారు. ఇందువల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ప్రధానమంత్రి సైతం దీనిపై నిస్సహాయత వ్యక్తం చేయడం బాధాకరమన్నారు. ‘కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పరస్పరం సహకరించుకునేందుకే ధరలు పెంపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ రెండు పార్టీల నాయకులు తమ ను ఎవరూ అడ్డుకోలేరనే విధంగా వ్యవహరిస్తున్నా రు.’అని విమర్శించారు.
వారి కలయిక అందుకే!
Published Fri, Jan 3 2014 11:17 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement