సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి అవినీతిని పారదోలుతామంటూ చెబుతున్న ఆప్ సర్కార్ అవినీతిలో ‘పెద్ద చేపలను’ వదులుతోందని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం తో ఢిల్లీ వాసులకు ఒరిగిందేమీ లేదని విమర్శించా రు. ఆమ్‌ఆద్మీపార్టీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాజ్‌ఘాట్‌లో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో బీజేపీ శాసనసభాపక్షనాయకుడు డా.హర్షవర్ధన్‌తోపాటు పార్టీ జాతీయ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, విజయ్‌కుమార్ మల్హోత్రా,విజయేంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ..ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కి నఖలు వంటిది. రెండు పార్టీలు అవకాశవాదంతోనే పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అవి నీతిని అంతమొందిస్తామంటూ రోజు కో ప్రకటన చేస్తున్న ఆప్ మంత్రులు ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
క్షేత్ర స్థాయిలో పనిని మరిచి ఆప్ సర్కార్‌మీడియా జిమ్మిక్కులు ప్రదర్శిస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత డా.హర్షవర్ధన్ ఆరోపించారు. కాశ్మీర్‌పై ఆప్ నాయకులు చేసిన వ్యాఖ్యలతోనే ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ విధానం ఏంటో అర్థమవుతోందని గోయల్ దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆప్ సర్కార్ దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ధర్నాలో బీజేపీ నాయకులంతా ‘మోడీ ఫర్ పీఎం’ అని రాసి ఉన్న కాషాయరంగు టోపీలను ధరించి కనిపించారు. దేశ ప్రజలం తా మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆ సందేశాన్ని తెలియజెప్పేందుకే తాము ఈ టోపీలను ధరించి వచ్చినట్టు ఓ నేత పేర్కొన్నారు.
ఆప్‌ది ప్రచారార్భాటం: అరుణజైట్లీ
రాష్ట్రంలో కేజ్రీవాల్ సర్కారు మీడియాలో ఎలా ప్రచారం పొందాలన్న విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోందని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టినట్లు నటిస్తున్న ఆ ప్రభుత్వం కాంగ్రెస్ అవినీతిపై దృష్టిపెట్టేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని ఆయన ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ హయాంలో జరిగిన సీడబ్ల్యూజీ స్కాం, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపులేకాక షీలా దీక్షిత్ సర్కారు అవినీతి ఆరోపణలపై కనీసం మాట్లాడేందుకు కూడా ఆప్ సర్కార్ ధైర్యం చేయలేకపోతోంద’ని అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీగా మారిన ఆప్ పనితీరు అంత స్ఫూర్తివంతంగా లేదన్నారు. ఢిల్లీపై ఎలాగైనా తన పట్టు కొనసాగించేందుకే ఆప్‌తో కాంగ్రెస్ జతకలిసింద ని ఆయన ఎద్దేవా చేశారు.
వాళ్లిద్దరూ తోడుదొంగలు
Published Fri, Jan 10 2014 11:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement