సీఎం.. ప్రకటనల పులి
Published Sat, Feb 8 2014 11:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనల పులిగా మారిపోయారని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అలవికాని హామీలు ఇవ్వడం.. వాటిని నెరవేర్చలేకపోవడం.. కేజ్రీవాల్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా అనధికార కాలనీల గురించి, రేషన్ కార్డులు, అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడటంలేదని విమర్శించారు. ఆప్ ప్రభుత్వం ప్రకటనలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ.. వాటి అమలుపై చూపడంలేదన్నారు. కొత్త పథకాలను ప్రకటించడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేర్రూ.వాల్ యత్నిస్తున్నారని గోయల్ విమర్శించారు. న గరవాసులు ఆప్ సర్కార్ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అనే అంశంపై రాష్ట్ర పార్టీ సర్వే నిర్వహించనుందని చెప్పారు.
జన్‌లోక్‌పాల్‌పై ఆయన మాట్లాడుతూ అది రాజ్యాంగబద్ధమా..కాదా అనే విషయం తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అది రాజ్యాంగబద్ధం కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వడం కష్టమేనని తేల్చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు జన్‌లోక్‌పాల్ బిల్లుపై సీఎం కేర్రూ.వాల్ రాసిన లేఖలో వాడిన భాష ఆక్షేపణీయమని గోయల్ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. వారికి ఎల్జీ తీరుపై ఏమైనా అనుమానాలుంటే రాష్ట్రపతిని కలిసి విన్నవించుకోవాలే తప్ప అటువంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. ‘మీరు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు..’ అని ఆప్ నాయకులను గోయల్ హెచ్చరించారు.
అనుమతితో పనేలేదు
నగరంలో చిన్న చిన్న స్థలాలు కలిగిన యజమానులకు శుభవార్త. 100 చదరపు మీటర్ల స్థలం కలిగిన వారు నిర్మాణ పనులను చేపట్టేందుకు ఇక పై ఆయా కార్పొరేషన్లనుంచి అనుమతి పొందరనవసరమే లేదు. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ టికెట్‌పై గెలుపొం దిన మూడు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని పైవిధం గా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను పాటిస్తామంటూ సంబంధిత అధికారులకు ఓ అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావన్నారు. 40 లక్షలమంది నివసించే అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేందుకు అనుమతించకపోవడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేం దు కు అనుమతించకుండా అభివృద్ధిని ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకోవడంపైనా వారంతా చర్చించారన్నారు.
అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతించకపోతే హైకోర్టు ఎదుట ధర్నాకు దిగుతామని ఆయనహెచ్చరించారు. ఈ అంశాన్ని ఎల్‌రూ. దృష్టికి తీసుకెళతామన్నారు. అనధికార కాలనీల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకుగాను తమ పార్టీ కార్యాలయంలో త్వరలో ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాలనీల్లో పారిశుధ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు ఆయన సూచించారు. ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ, ఈడీఎంసీల ఏకీకరణకు సంబంధించి ఎమ్మెల్యే నంద్ కిషోర్‌గార్గ్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశామని, సదరు కమిటీ తమకు సలహాలు, సూచనలు ఇస్తుందన్నామన్నారు. ‘ఏక్ నోట్-కమల్ పర్ ఓట్’ పేరిట కార్పొరేటర్లు తమ తమ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి యజమానులను కలుస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని వారంతా ఈ సందర్భంగా కోరతారన్నారు.
Advertisement