రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు.
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు. ‘పారాలింపిక్స్ విజేతలను మేం గౌరవించదలుచుకున్నాం. అందుకే పద్మ పురస్కారాల కోసం వారి పేర్లను హోం మంత్రిత్వ శాఖకు పంపించనున్నాం’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో తంగవేలు, దేవేంద్రలకు స్వర్ణాలు, దీపా మలిక్ రజతం, వరుణ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.