కేంద్ర క్రీడలమంత్రి విజయ్ గోయెల్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో భవిష్యత్‌లో బీసీసీఐ సమావేశం కావాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. ‘ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. దీనిపై కేంద్రం వైఖరి స్పష్టమైంది.
సరిహద్దు వెంట ఉగ్రవాద కార్యకలాపాలు ఆగితేనే ఆటలని తేల్చిచెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఇరు బోర్డులు సమావేశం కావాల్సిన అవసరం ఏముంది’ అని గోయెల్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లాను ఆయన నివాసంలో కలుసుకున్న గోయెల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ కోసం ఇప్పటికే రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.