Mirchowk SI points gun at car driver for vehicle checking - Sakshi
Sakshi News home page

Hyderabad: గన్‌ చూపించి కారును ఆపిన ఎస్సై..  అవాక్కైన వాహనదారులు

Published Wed, Dec 28 2022 8:21 AM | Last Updated on Wed, Dec 28 2022 3:19 PM

Mir Chowk Police Late Night Vehicles Checking With Gun In Old City - Sakshi

చేతిలో గన్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న మీర్‌చౌక్‌ ఎస్సై 

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌చౌక్‌ ఏసీపీ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్‌ టాప్‌ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్‌ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్‌చౌక్‌ ఎస్సై  వెంటనే స్పందించి తన పౌచ్‌లో ఉన్న గన్‌ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్‌ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్‌తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్‌ చూపించి సినిమా ఫక్కీలో హల్‌చల్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్‌ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్‌చౌక్‌ పోలీసులు ఫైన్‌ విధించి పంపించారు.

చేతిలో వెపన్‌ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య  
వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్‌లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్‌ వెపన్‌ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్‌ చేయండి: కేసీఆర్‌ ఫాంహౌస్‌ సినిమా అట్టర్‌ఫ్లాప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement