వీడియో: గన్‌ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి.. | Florida Restaurant Employee Save Mother Child From Armed Thief | Sakshi
Sakshi News home page

రియల్‌ హీరోకి హ్యాట్సాఫ్‌: తుపాకీ పేలేలోపు సూపర్‌హీరోలా దూసుకొచ్చి తల్లీబిడ్డల్ని కాపాడాడు

Published Sat, Sep 17 2022 11:30 AM | Last Updated on Sat, Sep 17 2022 11:37 AM

Florida Restaurant Employee Save Mother Child From Armed Thief - Sakshi

తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది.

తన ప్రాణాలను అడ్డుపెట్టి..  తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్‌ వాల్టన్‌ బీచ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్‌ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్‌ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. 

ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది.

ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్‌లో పని చేసే మైకేల్‌ గోర్డాన్‌గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్‌ హీరో ఉదంతం వెలుగు చూసింది.  తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్‌కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్‌ను అభినందించింది. సూపర్‌ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement