thief caught
-
Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని దోమలగూడ ఠాణా పరిధిలో ఈ నెల 12న తెల్లవారుజామున చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును మధ్య మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు ఛేదించారు. బాధితుడి తమ్ముడే దీనికి సూత్రధారిగా తేల్చారు. దొంగతనానికి పథకం ఓ న్యాయవాది వేయగా... ఇద్దరు రౌడీషీటర్లు తమ అనుచరులతో కలిసి అమలు చేసినట్లు గుర్తించారు. మొత్తం 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.1.2 కోట్ల విలువైన సొత్తు, వాహనం, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీలు అక్షాంశ్ యాదవ్, వైవీఎస్ సుదీంద్రలతో కలిసి బంజారాహిల్స్‌లోని టీజీ సీసీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన వ్యసనాలకు అన్నను బాధ్యుణ్ని చేస్తూ.. పశ్చిమ బెంగాల్ కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘోరాయ్, ఇంద్రజిత్ ఘోరాయ్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. దోమలగూడలోని అరి్వంద్నగర్లో ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో నివసిస్తూ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. రంజిత్ ప్రస్తుతం 50 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరగా... ఇంద్రజిత్ తనకు ఉన్న వ్యవసాలు, ఆన్లైన్ బెట్టింగ్, జల్సాలతో ఆర్థికంగా చితికిపోయాడు. ఇటీవలే రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు ఖరీదు చేశాడు. దీంతో అన్నపై ఇంద్రజిత్ ఈర‡్ష్య పెంచుకున్నాడు. అన్న వద్ద ఉండే బంగారం వివరాలు గమనిస్తూ వచి్చన ఇంద్రజిత్.. ఇటీవల ఆ వివరాలను తన వాకింగ్ మేట్స్ అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లకు చెప్పాడు. ఆ బంగారం దోచుకుని తీసుకువస్తే అందరికీ లాభమని అన్నాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషిటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా షేక్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షబ్బీర్‌కు చెప్పాడు. గ్యాంగ్‌తో రంగంలోకి దిగిన అర్బాజ్.. ఇంద్రజిత్ ద్వారా రంగంలోకి దిగిన మైలార్‌దేవ్‌పల్లి రౌడీషిటర్ మహ్మద్ అర్బాజ్ దోపిడీ చేయడానికి అంగీకరించాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని వాటాపై బేరసారాలు చేసుకున్నారు. ఇవి కొలిక్కిరావడంతో అర్బాజ్ తన అనుచరులైన షోయబ్ ఖాన్, షేక్ ఉస్మాన్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ అక్రమ్, షహబాజ్, నజీర్, జహీర్లతో కలిసి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించడంతో పాటు వాహనం ఖరీదు చేసిన అర్బాజ్.. రంజిత్ ఇంటి వద్ద రెక్కీ సైతం పూర్తి చేయించాడు. ఈ నేరం ఎలా చేయాలి? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలు చర్చించడానికి వీళ్లు బహదూర్‌పురకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం తీసుకున్నారు. నేరం చేయడానికి పది రోజుల ముందు మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ రెస్టారెంట్లో కీలక నిందితులతో సమావేశమైన నూరుల్లా పథకం అమలు చేయడం ఎలా? ఆధారాలు లేకుండా జాగ్రత్తపడటం ఎలా? అనే అంశాలను వారికి వివరించాడు. షబ్బీర్ ఇంటి నుంచి బయలుదేరిన ఆరుగురు... ఈ నెల 12 రాత్రి అర్బాజ్ నేతృత్వంలో హబీబ్ హుస్సేన్, షోయబ్, సైఫ్, గులాం మగ్దూం, షేక్ అల్లావుద్దీన్.. షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి వాహనంలో షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి రంజిత్ ఇంటి వద్దకు వచ్చారు. తమతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ భారీ గొడ్డలితో పాటు ఇతర గొడ్డళ్లు, కత్తులు, తుపాకీ మాదిరిగా కనిపించే లైటర్ తీసుకువచ్చారు. ఇంద్రజిత్ సాయంతోనే ఇంట్లోకి ప్రవేశించిన వీళ్లు రంజిత్ కుటుంబాన్ని బంధించి, వారి పిల్లల మెడపై కత్తి పెట్టి, అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని గాయపరిచి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆపై ఇంట్లో ఉన్న రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండితో పాటు పూజ గదిలో ఉన్న రెండు కేజీల ఇత్తడి సామాను సైతం దోచుకుపోయారు. పోలీసులకు ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ కేసు ఛేదించడానికి మధ్య మండల టాస్‌్కఫోర్స్ రంగంలోకి దిగింది. బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?ముమ్మర గాలింపుతో.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న ఈ కేసు చిక్కుముడి విప్పడానికి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్ శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలు సేకరించారు. షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన 12 మందిని ఆదివారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1,228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని కొత్వాల్ ఆనంద్ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు ప్రత్యేక రివార్డులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
Hyderabad: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ..
బంజారాహిల్స్: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 58లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు ఇంట్లోకి ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఓ యువకుడు ప్రవేశించి ఆయన కూతురు నవ్య బెడ్రూంలోకి వెళ్లి ఆమె మెడపై కత్తి పెట్టి రూ. 25 లక్షలు డిమాండ్ చేశాడు. గదిలోకి వచి్చన ఆమె తల్లి లీలను కూడా బెదిరించాడు. తన భర్తకు ఫోన్ చేసిన బాధితురాలు రూ. 8 లక్షలు తెప్పించి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు నిందితుడికి ఇవ్వడంతో పాటు తన సెల్‌ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం సెల్‌ఫోన్ ఆధారాలు మాత్రమే ఉండగా నిందితుడి కోసం పోలీసులు సాంకేతికతను వినియోగించారు. అదే రోజు మధ్యాహ్నం షాద్‌నగర్‌కు వెళ్లిన నిందితుడు తన కదలకలను పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు నాలుగైదు గంటలు అక్కడే గడిపి తిరిగి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. ఆ తెల్లవారే దొంగిలించిన డబ్బులో నుంచి రూ. 2.50 లక్షలు వెచి్చంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ నిందితుడు శుక్రవారం ఉదయం శామీర్‌పేట్‌లోని ఓ ఫామ్ హౌజ్‌లో స్నేహితులకు విందు ఇస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితుడు రెజిమెంటల్ బజార్లో నివసించే మోతిరాం రాజేష్ యాదవ్ (27)గా తేలింది. తన ఇంట్లో అప్పులతో పాటు తన జల్సాలకు డబ్బుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్లు సమాచారం. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. చోరీ చేసిన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిందితుడు జూబ్లీహిల్స్‌లోని ఏదైనా ఓ ఇంట్లోకి దూరి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లాలనే పథకంతో రోడ్ నెం 52లో తిరుగుతుండగా ప్రతి ఇంటి ప్రహరీ గోడ ఎత్తుగా ఉండటంతో లోపలికి దూకడం కష్టతరమైంది. ఒక్క ఎన్ఎస్ఎన్ రాజు నివాస ప్రహరీ మాత్రమే చిన్నగా ఉండటంతో ఆ ఇంటిని ఎంపిక చేసుకొని పక్కా ప్రణాళికతో ఇంట్లోకి దూరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
వీడియో: కదిలే రైలులో ఫోన్ చోరీయత్నం.. చేతులు, టీ షర్ట్ పట్టుకుని..
దొంగతనం.. ఎక్కడ చేసినా నేరమే. కొందరు తామే తోపులమంటూ చేతివాటం చూపిస్తుంటారు. క్షణాల్లో విలువైన వస్తువులు మాయం చేస్తుంటారు. ఇక బస్సులు, రైళ్లు వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. దీంతో, రైలు ప్రయాణీలకులు దొంగకు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఇటీవల బీహార్లోనే బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో ఓ దొంగ సెల్‌ఫోన్ దొంగలించచోయి ప్రయాణీకులకు చిక్కడంతో అతడికి చుక్కలు చూపించారు. తాజాగా మరో దొంగ సైతం ఇలాంటి దొంగతనానికే పాల్పడ్డాడు. ఈ వీడియోలో జమాల్పూర్-సాహిబ్‌గంజ్ ప్యాసింజర్ రైలు ఘోఘా స్టేషన్లో ఉండగా.. ఓ దొంగ రైలు కిటీకిలో నుంచి విండో సీట్లో ఉన్న ప్రయాణికుడి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు.. దొంగ చేతులను, టీ షర్టును కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా ప్రయాణికులు మాత్రం చేతులు వదలలేదు. ఇలా రైలు కొంత దూరం ప్రయాణించాక.. దొంగను రైలులోపలికి లాగారు. అనంతరం అతడిని చితకబాదారు. తర్వాత, రైల్వే పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వీడియో: గన్ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి..
తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్ వాల్టన్ బీచ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్‌ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది. In reference to the FWB Chick-fil-A employee who ran to help a woman with a baby who was being carjacked, we want to say a sincere thank you to Ms. Kelner for providing video of a portion of the encounter. (see prior post). A major shout-out to this young man for his courage! pic.twitter.com/2Lcwe46azv — OkaloosaSheriff (@OCSOALERTS) September 14, 2022 ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేసే మైకేల్ గోర్డాన్‌గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్ హీరో ఉదంతం వెలుగు చూసింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్‌కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్‌ను అభినందించింది. సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. -
తాళం వేసి ఉంటే లూటీనే..!
బంజారాహిల్స్: తాళంవేసి ఉన్న ఇంటి తాళాలు పగలకొట్టి ఖరీదైన సెల్ఫోన్లు, నగలు, నగదును తస్కరించిన ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్.రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, డీఎస్ఐ ఇ.రవితో కలిసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఘటన వివరాలు వెల్లడించారు. దుబాయ్‌లో నివసించే మహ్మద్ ఇమ్రాన్ సయ్యద్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈనెల 24న ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఓ వివాహ విందులో పాల్గొనేందుకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితులకు ఇచ్చేందుకు 22 సెల్ఫోన్లను, ఒక ట్యాబ్‌ను, ఒక కెమెరాను తీసుకువచ్చాడు. తీసుకువచి్చన సామగ్రిని బ్యాగ్‌లోనే పదిలపరిచి ఇంట్లో ఉంచి సాయంత్రం తాళం వేసి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. విందు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలకొట్టి ఉంది. లోనికి వెళ్లిచూడగా దుబాయ్ నుంచి తాను తీసుకువచి్చన సెల్ఫోన్లతో పాటు నగలు, నగదు కనిపించలేదు. అదే రోజు రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి దొంగతనం చేసిన వస్తువులతో వెళుతున్న దృశ్యాలు నిఘా నేత్రంలో స్పష్టంగా కనిపించాయి. స్థానికులు చెప్పిన ఆధారాలతో క్రైమ్ పోలీసులు చాంద్రయాణగుట్ట బార్కాస్‌లో తలదాచుకున్న ఫరీద్‌ఖాన్ అలియాస్ ఫరీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయింది. నిందితుడు నుంచి 22 సెల్ఫోన్లతో పాటు ఒక ట్యాబ్, ఒక కెమెరా, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.23 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఫరీద్ గతంలో కూడా హిమాయత్‌నగర్, సైఫాబాద్, గోల్కొండ, లంగర్‌హౌజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు ఆ కేసుల్లో రిమాండ్‌కు వెళ్లినట్లు తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన కేసుతో పాటు గతంలో ఇంకో ఐదు కేసుల్లో నిందితుడని ఆయన తెలిపారు. కారు మెకానిక్‌గా పనిచేస్తున్న ఫరీద్ జల్సాకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైమ్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు
సాక్షి, నిజామాబాద్ : మహిళ మెడలోని పుస్తెల తాడును దొంగిలించాలని చూసిన ఇద్దరు దొంగలు ఆమె కేకలు వేయడంతో పోలీసులకు దొరికిపోయారు. జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతకుముందు మంగళవారం బోధన్‌లోని నాయీ బ్రాహ్మణ వీధిలో ఇంటి బయట నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపడానికి ప్రయత్నించారు. కానీ, మహిళ అప్రమత్తంగా ఉండడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. బుధవారం ఎడవల్లిలో మాత్రం వారి ప్లాన్ సక్సెస్ అయ్యింది. వెంటనే మహిళ కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన పోలీసులు దొంగలను వెంబడించి సినీ ఫక్కీలో వారిని పట్టుకున్నారు. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. -
దొంగను వదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారనే వార్త ఆందోళన రేపింది. ఊర్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అప్రమత్తమైన గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి వారి కోసం కాపుకాశారు. మూడు ఇళ్లలో దొంగతానాలకు పాల్పడి పారిపోతున్న ముగ్గురు దొంగల్ని వెంబడించారు. అయితే, వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. తాళ్లతో కట్టేసి సదరు దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మిగతా దొంగలు దొరికేంత వరకు విడిచిపెట్టమని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటికి కన్నం వేసిన పని మనిషి అరెస్ట్
అత్తాపూర్ : నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అని ఇంటి పనులన్నీ అప్పజెప్పారు. అదే అదనుగా భావించిన ప్రబుద్ధుడు పని చేస్తున్న ఇంటికే కన్నం పెట్టాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పో లీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన నగర శి వారులోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ జోన్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలోని ప్రెస్టేజ్ రాయల్ విల్లాస్ లోని 56వ ప్లాట్‌లో గత కొంతకాలంగా డాక్టర్ రా మకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే భార్యాభర్తలు ఉద్యోగులు కావడంతో ఇంట్లో వంట చేయడానికి తమకు తెలిసిన బంధువుల ద్వారా ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్న రవి అనే వ్యక్తిని ఫిబ్రవరి మాసంలో వంట మనిషిగా పెట్టుకున్నారు. అదే అదనుగా భావించిన రవి.. దంపతులిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో బీరువాలో ఉన్న 51 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును దోచుకోని పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పని మనిషి రవికి ఫోన్ చేస్తే స్వీఛాప్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఆఫీసర్ అశోక్‌కుమర్ తదితరులు పాల్గొన్నారు. -
చాలా చెత్త ఐడియా గురూ!
ఈ ఫొటోలోని వ్యక్తి ఓ దొంగ. కాకపోతే చాలా అమాయకపు దొంగ.. ఓ తెలివి తక్కువ దొంగ.. ఎందుకిలా అంటున్నామంటే దొంగతనం చేసేందుకు అతడు వేసిన ఐడియా తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుందనుకున్నాడు. కానీ ఆ ఐడియానే చెత్త ఐడియాగా మారి ఆఖరికి కటకటాల పాలు చేస్తుందని కనీసం ఊహించనే లేదు. ఇంతకీ మన దొంగగారు ఏం చేశాడంటే.. దొంగతనానికి వెళ్లే ముందు ఎవరూ తనను గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మొత్తం ఆకుపచ్చ రంగు పూసుకున్నాడు. అదే అతడి కొంప ముంచింది. రష్యాలోని ఓ పట్టణం రైల్వే స్టేషన్లో ఓ మహిళ పర్సు దొంగతనం చేసి పారిపోయాడు. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కొందరు ప్రయాణికులను దొంగ గురించి ఆనవాళ్లు చెప్పమనగానే ఠక్కున ముఖానికి ఆకుపచ్చ రంగు ఉందని చెప్పారు. ఇంకేముంది ఆ పట్టణం మొత్తం పోలీసులు జల్లెడ పట్టేశారు. ఆకుపచ్చ రంగు వేసుకున్న వ్యక్తిని గుర్తించడం వారికి పెద్ద కష్టమేమీ కాలేదు. చివరికి దొంగను అరెస్ట్ చేశారు. -
దొంగ మెడలో చెప్పుల దండ
బరంపురం (ఒరిస్సా) : గంజాం జిల్లా పురుషోత్తంపురంలో దొంగను పట్టుకొని గ్రామస్తులు చితక బాది దొంగ మెడలో చెప్పుల దండవేసి గ్రామమంతా ఊరేగించారు. పోలీసులు అందించిన సమాచా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పురుషోత్తం పురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రణజూలి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలో చోరీకి యత్నిస్తూ గ్రామస్తులకు ఓ దొంగ చిక్కా డు. దీంతో గ్రామస్తులు దొంగను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆడి.. బెంజ్.. బీఎండబ్ల్యు.. ఇవే ఆ దొంగ టార్గెట్!
ఢిల్లీ పోలీసులు ఒక కార్ల దొంగను పట్టుకున్నారని మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆఫ్టరాల్ కార్ల దొంగ పట్టుబడితే ఏమవుతుందని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక రోజు తర్వాత అసలు విషయం మొత్తం బయటపడింది. అతగాడు ఆషామాషీ దొంగ కాదు. కేవలం హై ఎండ్ కార్లను మాత్రమే దొంగిలిస్తాడు. అతగాడి చెయ్యి పడాలంటే అది కనీసం ఏ బెంజో, బీఎండబ్ల్యునో, ఆడి కారో అయ్యుండాలి. అంతటి పెద్ద దొంగ అన్న మాట. అతడి వయసు కేవలం 27 ఏళ్లు. పేరు రాబిన్ అలియాస్ రాహుల్. ఇంతకీ కార్లను ఎందుకు దొంగిలిస్తాడో తెలుసా.. గర్ల్ఫ్రెండ్లను ఇంప్రెస్ చేయడానికే! తాజాగా ఢిల్లీ పశ్చిమవిహార్ ప్రాంతంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ వద్ద బీఎండబ్ల్యు కారును దొంగిలించి తీసుకెళ్లి, దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడివద్ద ఉన్న ఒక బీఎండబ్ల్యు, ఒక టయోటా ఫార్చూనర్ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమా చూసి తాను స్ఫూర్తి పొంది ఇలా దొంగతనాలు చేస్తున్నానని చెప్పాడు. ఆ సినిమాలో ‘బంటీ చోర్’ పాత్ర పోషించిన నటుడి ఫొటోను కూడా రాహుల్ తన జేబులో పెట్టుకున్నాడు. చాలా విలాసవంతమైన జీవితం గడుపుతాడని, తరచు ఢిల్లీలోని పబ్‌లు, మాల్స్ వద్ద కనిపిస్తాడని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు అతడు దొంగిలించిన కార్లలో ఆడి, బీఎండబ్ల్యు, ఫార్చూనర్, మెర్సిడెస్, స్కోడా లాంటి కార్లు ఉన్నాయి. తెల్లవారుజామున యజమానులు మార్నింగ్ వాక్ కోసం వెళ్లినపుడు ఇంట్లో ప్రవేశించి, కారు తాళాలు తీసుకుని మరీ కారు తీసుకెళ్తాడట. ఢిల్లీతో పాటు హరియాణా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ ఇతడు తన చేతివాటం చూపించాడు. అతడు బీఎండబ్ల్యు, ఆడి కార్లను దొంగతనం చేసి తీసుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పోలీసులు పట్టుకోగలిగారు. -
ఆ గేదె.. దొంగని పట్టించింది
కొండాపురం (నెల్లూరు జిల్లా): నిద్రిస్తున్న మహిళ నుంచి నగలు లాక్కుని పారిపోతుండగా అక్కడే ఉన్న గేదె పొడవటంతో గాయాలపాలై ఓ దొంగ దొరికాడు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన మేడేపల్లి విజయమ్మ, ఆమె కుమార్తె దొరసానమ్మ, కొడుకు హజరత్ ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చి విజయమ్మ మెడలోని నాలుగున్నర సవర్ల బంగారం గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. తల్లి, కూతురు గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పరుగు అందుకున్నారు. వారిలో ఒకరిని ఇంటి ఆవరణలో కట్టేసిన గేదె పొడవటంతో పక్కనే బండలపై పడి గాయపడ్డాడు. అప్రమత్తమై చుట్టుపక్కల వారు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ దొంగని పట్టుకుని చితకబాదారు. అతని దాడిలో విజయమ్మ కూడా గాయపడింది. క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.