దొంగను వదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం | Villagers Caught A Thief In West Godavari And Beat Him | Sakshi
Sakshi News home page

దొంగను వదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం

Published Fri, Aug 10 2018 8:34 AM | Last Updated on Fri, Aug 10 2018 9:00 AM

Villagers Caught A Thief In West Godavari And Beat Him - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారనే వార్త ఆందోళన రేపింది. ఊర్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అప్రమత్తమైన గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి వారి కోసం కాపుకాశారు. మూడు ఇళ్లలో దొంగతానాలకు పాల్పడి పారిపోతున్న ముగ్గురు దొంగల్ని వెంబడించారు. అయితే, వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. తాళ్లతో కట్టేసి సదరు దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మిగతా దొంగలు దొరికేంత వరకు విడిచిపెట్టమని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement