thadepalligudem
-
అనూహ్య రేఖ
ఆమె సరళ రేఖ కాదు. వక్రరేఖ కాదు. ఒక అనూహ్య రేఖ. తెలుగు, తమిళం అనే మాతృ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్లో చక్రం తిప్పింది. హీరోలకు ఇన్స్పిరేషన్. హీరోయిన్లకు గ్లామర్ టీచర్. నేడు ఆమెకు 67 నిండి 68 వస్తున్నాయి. రేఖను తాడేపల్లిగూడెం అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి నటి పుష్పవల్లిది అదే ఊరు. పుష్పవల్లి నటిగా ఎదగడం, జెమిని గణేశన్‌తో సహజీవనం చేయడం ఆ రోజుల్లో సంచలనం. జెమిని గణేశన్ వల్ల ఆమెకు రేఖ, మరో కుమార్తె రాధ పుట్టారు. కాని రేఖ జీవితంలో తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. తండ్రి చాలా కాలం రేఖను తన కూతురుగా అంగీకరించలేదు. అప్పటికే ఒక పెళ్లి అయిన జెమినీ గణేశన్ సావిత్రితో పెళ్లి సమయంలో పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు. సావిత్రితో పెళ్లి బహిర్గతం అయ్యాక ఆమెకు దూరం అయ్యాడు. అందువల్ల కావచ్చు బహుశా పబ్లిక్‌గా రేఖను తన కుమార్తె అని ఆయన చెప్పుకోలేదు. రేఖకు ఈ గాయం ఒకటైతే తల్లి ఆ తర్వాత మరో సంబంధంలోకి వెళ్లి ఫలితంగా పుట్టిన మరో ముగ్గురిని పెంచాల్సి రావడంతో రేఖ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. తన జీవితం తాను జీవించాలనుకుంది. తన జీవిత రేఖ తానే గీసుకోవాలనుకుంది. రేఖ అలా పెరిగింది. ఇంతేరా ఈ జీవితం ‘రంగుల రాట్నం’లో భుజంగరాయ శర్మ రాసిన ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ పాట రేఖకు సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రేఖ ‘బేబీ రేఖ’ పేరుతో నటించింది. రంగుల రాట్నంలో పైకి కిందకు ఉత్థాన పతనాలు ఉంటాయి. రేఖ జీవితంలో కూడా ఉన్నాయి. తెలుగులో ‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణంరాజు పక్కన నటించిన రేఖ తన తల్లి సమాజానికి తండ్రి సమాజానికి దూరంగా వెళ్లదలుచుకుంది. ముంబై వెళ్లి 14–15 ఏళ్లకే ‘సావన్ భాదో’ సినిమాలో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయినా రేఖను ఎవరూ లెక్క చేయలేదు. పైగా ‘నల్లబాతు’ అని పిలిచేవారు. ఆమె రంగు, బొద్దుగా ఉండే రూపం నార్త్‌కు పనికి రాదని పత్రికలు రాశాయి. కాని రేఖ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మన రూపాన్ని మనం చెక్కుకోవచ్చు అని మొదటిసారి బాలీవుడ్‌కి తెలియచేసింది రేఖ. ఆ తర్వాత ఆమె రూపం మారింది. ఫ్యాషన్ మారింది. నటన మారింది. రేఖ అంటే ‘ఫ్యాషన్ దివా’ అని పేరు తెచ్చుకుంది. తోడు ఎవరు? రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అమితాబ్‌తో ఆమె తొలిసారిగా ‘దో అంజానే’ లో నటించింది. పెళ్లయిన అమితాబ్ రేఖ ఆకర్షణలో పడ్డాడని ఆ వెంటనే వాళ్లు కలిసి చేసిన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘మొకద్దర్ కా సికిందర్’, ‘సిల్సిలా’... ఇవి రేఖ–అమితాబ్‌ల చిత్రాలు. వీరి ప్రేమ, ఆ సమయంలో జయభాదురి మానసిక సంఘర్షణ యశ్‌చోప్రాను ‘సిల్సిలా’ తీసేలా చేశాయి. నిజ జీవితం లోని పాత్రలు సినిమా తెర మీద నటించడం బహుశా మొదటి చివరి సారిగా ఈ సినిమాలోనే జరిగిందేమో. అయితే ఈ సినిమా అంత విజయం సాధించలేదు. రేఖ తన తోటి నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకుందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ముంబై వ్యాపారి ముఖేశ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. నాలుగు పార్టీల్లో కలిసిన ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని దూకుడుగా అడిగితే రేఖ కూడా అంతే దూకుడుగా ఓకే అనడం ఆ రోజే వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ వెంటనే ఒకరి లోపాలు ఒకరికి తెలిసి ఆ పెళ్లి ప్రమాదంలో పడింది. ముఖేశ్ అగర్వాల్ పెళ్లయిన ఒక సంవత్సరం లోపే రేఖ చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దృష్టి నుంచే చూసింది. గొప్పనటి రేఖ గొప్ప నటి, డాన్సర్. రేప్ విక్టిమ్గా ‘ఘర్’ సినిమాలో నటించి ఆమె తన సీరియస్ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్ అలీ దర్శకత్వంలో ‘ఉమ్రావ్‌జాన్’లో నటించి రేఖ విమర్శకులను అప్రతిభులను చేసింది. ఒక తవాయిఫ్ జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్ ‘కలియుగ్’, గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ ఆమెను పార్లల్ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు ‘ఫూల్ బనే అంగారే’, ‘ఖూన్ భరీ మాంగ్’ ఆమెను యాక్షన్ హీరోయిన్ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది. జుట్టు తెల్లబడని నటి రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘ఆజ్ కల్ పావ్ జమీపర్ నహి పడ్తే హై మేరే’, ‘తేరే బినా జియా జాయేనా’, ‘సున్ సున్ దీదీ తేరే లియే ఏక్ రిష్టా ఆయాహై’, ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే రాజ్ హై’, ‘పర్ దేశియా ఏ సచ్ హై పియా’... ఎన్నో హిట్ సాంగ్స్ రేఖకు. ఆమెకు 68 వచ్చేశాయంటే నమ్మడం కష్టం. కాని వయసును జయించిన భాగ్యం ఈ భానురేఖదే కదా. రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. -
తాడేపల్లిగూడెం: కూలిన సెల్ టవర్.. వ్యక్తి మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం పట్టణంలో తహశీల్దారు కార్యాలయం సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఈదురుగాలల ధాటికి ఓ సెల్ టవర్ కూలిపోయింది. ఆ సమయంలో కేఎన్ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పడింది. ఈ ఘటనలో బొట్టా రాజేశ్(43) అక్కడిక్కడే మృతి చెందగా, అతడి వెనుక కూర్చున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: స్నేహితులతో కలిసి వచ్చి.. అనంత లోకాలకు.. యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా.. -
సన్నిహితంగా మెలిగి ఆపై మోసం!
తాడేపల్లిగూడెం రూరల్: బాలికను నమ్మించి మోసగించిన నేరంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఏఎస్సై దుర్గారావు తెలిపారు. శనివారం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పట్టెంపాలెం గ్రామానికి చెందిన బాలిక (18) తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బొనిగే వెంకటరవికుమార్ ఆమె వెంటపడి ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో సదరు బాలికతో సన్నిహితంగా మెలిగాడు. కాగా, బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నిరాకరించాడు..దీంతో మోసపోయానని గ్రహించిన బాలిక రూరల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఏఎస్సై దుర్గారావు తెలిపారు. చదవండి: 27 ఏళ్ల క్రితం అత్యాచారం.. నాన్న పేరేంటని కొడుకు ప్రశ్నించడంతో -
బైక్‌పై వెనుక కూర్చుని.. కసితీరా పొడిచేసింది
కొవ్వూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు. బహిరంగ పెళ్లికి నిరాకరించాడు. పైగా అనుమానంతో ప్రేయసిపై వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం ఆరంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేక ఆ నయవంచకుడిని యువతి కత్తితో పొడిచి హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాడేపల్లిగూడెంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి.. కులాలు వేరు కావడంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. అయితే యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. కొంతకాలం సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరగా అందుకు ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి వేధింపులు తాళలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. సోమవారం యువతికి ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్‌కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. (చదవండి: ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణం) అనంతరం ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని కోరడంతో మోటారు సైకిల్‌పై బయల్దేరారు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది. ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు. -
కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై రెండవ రోజు తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నాయి. నరసింహారావు పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లూ, నిర్మాణాలు అధికారులు తొలగించారు. నిన్న జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేయటంతో కూల్చివేత పనులు మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు జరగకుంగా ముందస్తు జాగ్రత్తలు సిద్ధం చేసిన ఎండోమెంట్ అధికారులు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు -
బాపిరాజు ఇంటి వద్ద హైడ్రామా
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం ఈలి నానికి కేటాయించడంపై ముళ్లపూడి బాపిరాజుతో పాటు ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలూరులో బాపిరాజు తన నివాసంలో కార్యకర్తలు, నాయకులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. అలాగే తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఇతర ముఖ్యనేతలతో కూడా రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలిసింది. బాపిరాజుకు ఈసారి సీటు కేటాయించకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ బాపిరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తాడేపల్లిగూడెం టిక్కెట్‌పై చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన , ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సీట్ల కేటాయింపు విషయంలో అభ్యంతరాలను తన దృష్టికి తీసుకురాకుండా సమావేశాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారనే అంశంపై జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలిసింది. -
మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు నివాసం(తాడేపల్లిగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించిన ఆయనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. రోడ్డుపై గంటకు పైగా తీవ్రమైన ఎండలో కూర్చోవడం, పోలీసులు లోపలికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన పెనుగులాటలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్ డౌన్, పోలీసుల దైర్జన్యం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన మాణిక్యాల రావును పోలీసులు ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. -
చంద్రబాబు మానసికస్థితిపై అనుమానంగా ఉంది
తాడేపల్లిగూడెం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడారు. దేశం భ్రష్టుపట్టుకుని పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకొచ్చి పార్టీని పునర్మించండని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తులందరూ నా సలహాతోనే పైకొచ్చారు..నేనే వారందరికీ మార్గదర్శినని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందని, ఆయన ఎక్కడైనా చూపించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క అంగుళమైనా ఇసుక ఉచితంగా వస్తుందా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రాన్ని తెలుగు దొంగలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. నీరు-చెట్టు తెలుగుదేశం పాలిట కల్పతరువుగా మారిందని వ్యాక్యానించారు. జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు ఈ సందర్భంగా మాణిక్యాల రావు సవాల్ విసిరారు. మీరు తవ్వే నల్లజర్ల, జగన్నాథపురం చెరువుల్లో అయినా లేక మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా, టైం మీరు చెప్పినా లేక మమ్మల్ని చెప్పమన్నా సరే నేను రెడీ అని మాణిక్యాల రావు ప్రకటించారు. గురివింద గింజలా మీ కింద మచ్చ ఉంచుకుని నాపై విమర్శలు చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. నేను చేసే సేవాకార్యక్రమాల గురించి గుడి, బడి, ఆసుపత్రి దగ్గర అడిగితే చెబుతారు..నేనొక సామాన్యుడిగా ఇవన్నీ చేశా..మీరు గొప్పవాళ్లని చెబుతున్నారు కదా మీరు చేసిందేమిటో కనీసం ఒక్కటైనా చెప్పాలని సూటిగా అడిగారు. -
చింతమనేని దూషణలు..హేయమైన చర్య
తాడేపల్లిగూడెం: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను చింతమనేని బండబూతులు తిడుతూ దూషించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట ఏరియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో దూసనపూడి విలేకరులతో మాట్లాడారు. చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారహీనంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన్ని కంట్రోల్ చేసే విధానం ప్రభుత్వానికి కనిపిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంటే శాసనాలు చేసి ప్రజల్ని పరిరక్షించాలి కానీ ఇలా జనాలపై దాడులు చేస్తూ, బాధ్యతా రాహిత్యంగా ఉన్న వ్యక్తికి శాసనసభకు వెళ్లే అర్హత లేదని స్పష్టం చేశారు. చింతమనేని వ్యవహారంలో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులను దూషించడం, వారిపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రాంతాలకతీతంగా జర్నలిస్టులంతా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. -
అరవింద సమేత బ్యానర్ కడుతూ ..
సాక్షి, పశ్చిమ గోదావరి : ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని శేషమహాల్ థియేటర్లో పండు అనే యువకుడు పని చేస్తున్నాడు. ‘జూ.ఎన్టీఆర్’ కథానాయకునిగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంగా థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు కట్టే పనిని యాజమాన్యం పండుకు అప్పగించింది. దీంతో బ్యానర్ కట్టే పనిలో అతడు తలమునకలై ఉండగా విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలాడు. ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రికి తీసుకురాకముందే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండు మృతితో తమకు సంబంధంలేదంటూ థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పండు మృతదేహంతో ఆసుపత్రి వద్ద వారు ఆందోళన చేపట్టారు. -
దొంగను వదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారనే వార్త ఆందోళన రేపింది. ఊర్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అప్రమత్తమైన గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి వారి కోసం కాపుకాశారు. మూడు ఇళ్లలో దొంగతానాలకు పాల్పడి పారిపోతున్న ముగ్గురు దొంగల్ని వెంబడించారు. అయితే, వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. తాళ్లతో కట్టేసి సదరు దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మిగతా దొంగలు దొరికేంత వరకు విడిచిపెట్టమని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తాడేపల్లిగూడెంలో భారీ చోరీ
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడకండ్ల శాంతినగర్‌లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. తాడేపల్లిగూడెం వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు... కడకండ్ల శాంతినగర్ ఒకటవ రోడ్డులో నివాసం ఉంటున్న ఎక్సైజ్ ఉద్యోగి మురళి శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. అదే అనువుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి 10 కాసుల బంగారం, 60 వేల రూపాయల నగదు ను దోచుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మురళి దొంగతనం జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.