
తాడేపల్లిగూడెం రూరల్: బాలికను నమ్మించి మోసగించిన నేరంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఏఎస్సై దుర్గారావు తెలిపారు. శనివారం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పట్టెంపాలెం గ్రామానికి చెందిన బాలిక (18) తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బొనిగే వెంకటరవికుమార్ ఆమె వెంటపడి ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ నేపథ్యంలో సదరు బాలికతో సన్నిహితంగా మెలిగాడు. కాగా, బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నిరాకరించాడు..దీంతో మోసపోయానని గ్రహించిన బాలిక రూరల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఏఎస్సై దుర్గారావు తెలిపారు.
చదవండి: 27 ఏళ్ల క్రితం అత్యాచారం.. నాన్న పేరేంటని కొడుకు ప్రశ్నించడంతో
Comments
Please login to add a commentAdd a comment