తాడేపల్లిగూడెం: కూలిన సెల్‌ టవర్‌.. వ్యక్తి మృతి | Cell Tower Falls Upon Bike 1 Deceased On Spot Thadepalligudem | Sakshi
Sakshi News home page

కూలిన సెల్‌ టవర్‌.. వ్యక్తి మృతి, మహిళకు తీవ్ర గాయాలు

Published Mon, Apr 5 2021 6:28 PM | Last Updated on Mon, Apr 5 2021 7:58 PM

Cell Tower Falls Upon Bike 1 Deceased On Spot Thadepalligudem - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి:  తాడేపల్లిగూడెం పట్టణంలో తహశీల్దారు కార్యాలయం సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రమైన ఈదురుగాలల ధాటికి ఓ సెల్‌ టవర్‌ కూలిపోయింది. ఆ సమయంలో కేఎన్‌ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పడింది. ఈ ఘటనలో బొట్టా రాజేశ్‌(43) అక్కడిక్కడే మృతి చెందగా, అతడి వెనుక కూర్చున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి: స్నేహితులతో కలిసి వచ్చి.. అనంత లోకాలకు..
యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement