
సాక్షి, పశ్చిమ గోదావరి : అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై రెండవ రోజు తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నాయి. నరసింహారావు పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లూ, నిర్మాణాలు అధికారులు తొలగించారు.
నిన్న జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేయటంతో కూల్చివేత పనులు మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు జరగకుంగా ముందస్తు జాగ్రత్తలు సిద్ధం చేసిన ఎండోమెంట్ అధికారులు భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు
Comments
Please login to add a commentAdd a comment