arguement with police
-
దొంగను వదిలేది లేదంటూ పోలీసులతో వాగ్వాదం
సాక్షి, పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారనే వార్త ఆందోళన రేపింది. ఊర్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానంతో అప్రమత్తమైన గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి వారి కోసం కాపుకాశారు. మూడు ఇళ్లలో దొంగతానాలకు పాల్పడి పారిపోతున్న ముగ్గురు దొంగల్ని వెంబడించారు. అయితే, వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. తాళ్లతో కట్టేసి సదరు దొంగకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మిగతా దొంగలు దొరికేంత వరకు విడిచిపెట్టమని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈసారి పోలీసులతో పెట్టుకున్న ఎంపీ
-
ఈసారి ఆ ఎంపీ పోలీసులతో పెట్టుకున్నారు!
ముంబై: కొన్నిరోజుల కిందట ఎయిరిండియా సిబ్బందితో గొడవకు దిగిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పోలీసులతో మాటలయుద్ధానికి దిగారు. మరాఠ్వాటాలోని లాతూర్ ప్రాంతంలో ఏటీఎంలలో డబ్బులు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పోలీసులతో వాడీవేడి వాగ్వాదానికి దిగారు. పోలీసులను గట్టిగా వారిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో డబ్బు లేదని శివసేన శ్రేణులు నిరసన తెలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గైక్వాడ్ గతంలో ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి.. మేనేజర్ను కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బిత్తరపోయిన ఎయిరిండియా ఆయనపై విమానాలు ఎక్కకుండా నిషేధం విధించింది. శివసేన ఎంపీలతో నిరసన, ఒత్తిడితో ఈ బహిష్కరణ ఎయిరిండియా తర్వాత వెనుకకు తీసుకుంది. #WATCH: Shiv Sena MP Ravindra Gaikwad argues with a police officer in Latur (Maharashtra) during a protest over a non-functioning ATM pic.twitter.com/k1rCa12aGc — ANI (@ANI_news) 19 April 2017