
ఆకుపచ్చ రంగు పూసుకున్న దొంగ
ఈ ఫొటోలోని వ్యక్తి ఓ దొంగ. కాకపోతే చాలా అమాయకపు దొంగ.. ఓ తెలివి తక్కువ దొంగ.. ఎందుకిలా అంటున్నామంటే దొంగతనం చేసేందుకు అతడు వేసిన ఐడియా తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుందనుకున్నాడు. కానీ ఆ ఐడియానే చెత్త ఐడియాగా మారి ఆఖరికి కటకటాల పాలు చేస్తుందని కనీసం ఊహించనే లేదు. ఇంతకీ మన దొంగగారు ఏం చేశాడంటే.. దొంగతనానికి వెళ్లే ముందు ఎవరూ తనను గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మొత్తం ఆకుపచ్చ రంగు పూసుకున్నాడు. అదే అతడి కొంప ముంచింది.
రష్యాలోని ఓ పట్టణం రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పర్సు దొంగతనం చేసి పారిపోయాడు. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కొందరు ప్రయాణికులను దొంగ గురించి ఆనవాళ్లు చెప్పమనగానే ఠక్కున ముఖానికి ఆకుపచ్చ రంగు ఉందని చెప్పారు. ఇంకేముంది ఆ పట్టణం మొత్తం పోలీసులు జల్లెడ పట్టేశారు. ఆకుపచ్చ రంగు వేసుకున్న వ్యక్తిని గుర్తించడం వారికి పెద్ద కష్టమేమీ కాలేదు. చివరికి దొంగను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment